బ్యాంకుల్లో ఏవైనా పనులు ఉన్నాయా ? వెంటనే చేసుకోండి..చాలా రోజులు బ్యాంకులు మూసి ఉండబోతున్నాయి..!

కరోనా నేపథ్యంలో చాలా మంది బ్యాంకింగ్‌ పనులను మొబైల్‌ బ్యాంకింగ్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ల ద్వారానే పూర్తి చేసుకుంటున్నారు. కానీ కొన్ని పనుల కోసం మాత్రం బ్యాంకులకు వెళ్లి తీరాల్సిందే. వాటిని ఆన్‌లైన్‌లో చేయలేము. ఈ క్రమంలో అలాంటి పనులు ఉన్నవారు వెంటనే తమ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసుకోవడం మంచిది. లేదంటే ఇబ్బందుల్లో పడిపోతారు. ఎందుకంటే బ్యాంకులు చాలా రోజుల పాటు మూసి ఉండబోతున్నాయి

ఈ నెల 27వ తేదీ నుంచి ఏప్రిల్‌ 4వ తేదీ వరకు.. అంటే దాదాపుగా 9 రోజుల పాటు బ్యాంకులకు వెళ్లి పనులు పూర్తి చేసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే…

 మార్చి 27వ తేదీన నెలలో నాలుగవ శనివారం అవుతుంది.

*మార్చి 28వ తేదీ ఆదివారం

*మార్చి 29న హోలీ ఉంది.

*మార్చి 30న చాలా ప్రాంతాల్లో బ్యాంకులు మూసి ఉండనున్నాయి.

* మార్చి 31న ఆర్థిక సంవత్సరం చివరి రోజు కనుక బ్యాంకులో సిబ్బంది బిజీగా ఉంటారు. మన పనులు చేసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది.

* ఏప్రిల్‌ 1వ తేదీన అకౌంట్స్‌ క్లోజింగ్‌ డే. కనుక సహజంగానే బ్యాంకులు పనిచేయవు.

* ఏప్రిల్‌ 2న గుడ్‌ ఫ్రైడే.

* ఏప్రిల్‌ 3న సెలవు లేదు. బ్యాంకులు పనిచేస్తాయి. కానీ జనాలు ఎక్కువగా ఉండేందుకు అవకాశం ఉంటుంది.

* ఏప్రిల్‌ 4 ఆదివారం.

అంటే.. మీరు ఏదైనా పని ఉంటే మార్చి 27వ తేదీ లోపు బ్యాంకులో పూర్తి చేసుకోవాలి. లేదా ఏప్రిల్‌ 5వ తేదీ వరకు ఆగాలి. పని లేదనుకుంటే ఓకే. కానీ పనులు ఉన్నవారు మాత్రం చెప్పిన తేదీలోగా పూర్తి చేసుకోవాలి. లేదంటే ఇబ్బందులు పడక తప్పదు.

Flash...   3rd party evaluation of Video Lessons telecasted through Doordarshan