Income Tax Clarifications on House Loan

 డి.డి.ఓ లు తరచు అడుగుచున్న ప్రశ్నలు

incometax

హౌసింగ్ లోన్ విషయంలో తరచు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఇంట్రెస్ట్ అనేది సెక్షన్ 24
మాత్రమే కాకుండా ఇంకా వేరు సెక్షన్లలో ఇంట్రెస్ట్ డిడక్ట్ అవుతుంది అని. హౌసింగ్
లోన్ ఇంట్రెస్ట్ సంబంధించిన సెక్షన్ల గురించి ఓసారి చూద్దాం.

సెక్షన్ 24 :

ఈ సెక్షన్ లో గరిష్టంగా 2లక్షల వరకు హౌసింగ్ లోన్ పైన చెల్లించిన ఇంట్రెస్ట్ కి
మినహాయింపు కలదు.

నిబంధనలకు లోబడి సెక్షన్ 24 కి అదనంగా ఇంట్రెస్ట్ మినహాయింపు ఉన్న  సెక్షన్ల
వివరాలు నిబంధనలు ఏంటి ఎవరికి వర్తించవచ్చు అనేది చూద్దాం.

సెక్షన్ 80EE :

సెక్షన్ 24 లో 2లక్షల వరకు మినహాయింపు పొగ ఇంకా అదనంగా చెల్లించిన ఇంట్రెస్ట్ ఈ
సెక్షన్ లో గరిష్టంగా 50,000 వరకు అదనపు మినహాయింపు కలదు. 

80 EE వర్తింపు నిబంధనలు:

1. హోమ్ లోన్ బ్యాంక్ ల నుండి లేదా హౌసింగ్ ఫైనాన్సు కంపెనీల నుండి తీసుకుని
ఉండాలి. 

2. లోన్ FY 2016 -17 (01.04.2016 నుండి 31.03.2017 మధ్య) లో మాత్రమే తీసుకుని
ఉండాలి. 

3. వారి పేరిట కేవలం ఈ ఒక్క ఇల్లు మాత్రమే ఉండాలి.

4. వారు ఈ ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న రుణం 35లక్షలు లేదా 35లక్షల లోపు ఉండాలి

5. ఇట్టి ఇంటి విలువ (ప్రభుత్వ విలువ) 50లక్షలు లేదా 50లక్షల లోపు ఉండాలి.

పై 5నిబంధనలు సంతృప్తి చెందిన వారు అదనపు 50,000 మినహాయింపుకు అర్హులు.

సెక్షన్ 80EEA :

సెక్షన్ 24 లో 2లక్షల వరకు మినహాయింపు పొగ ఇంకా అదనంగా చెల్లించిన ఇంట్రెస్ట్ ఈ
సెక్షన్ లో గరిష్టంగా 1,50,000 వరకు హౌసింగ్ లోన్ పైన చెల్లించిన ఇంట్రెస్ట్ కి
అదనపు మినహాయింపు కలదు. 

80 EEA వర్తింపు నిబంధనలు:

 1. లోన్ బ్యాంక్ ల నుండి లేదా హౌసింగ్ ఫైనాన్సు కంపెనీల నుండి తీసుకుని
ఉండాలి. 

Flash...   Voter ID Card: కొత్త ఓటరు కార్డు ఇలా తీసుకోండి

2. లోన్ FY 2019 -20 (01.04.2019 నుండి 31.03.2020 మధ్య) లో మాత్రమే తీసుకుని
ఉండాలి. 

3. వారి పేరిట కేవలం ఈ ఒక్క ఇల్లు మాత్రమే ఉండాలి.

4. రిజిస్ట్రేషన్ కోసం ఇంటి విలువ (ప్రభుత్వ విలువ) 45లక్షలు లేదా 45లక్షల లోపు
విలువ ఉన్న ఇంటికి స్టాంప్ డ్యూటీ చెల్లించి ఉండాలి. 

పై 4నిబంధనలు సంతృప్తి చెందిన వారు అదనపు 1,50,000 మినహాయింపుకు అర్హులు.

పై రెండు సెక్షన్లు (80EE & 80EEA) నిబంధనలు సంతృప్తికరంగా ఉన్నవారు మాత్రమే
అదనపు మినహాయింపు వర్తిస్తుంది.

Download KSS prasad IT software