IMMS లో విద్యార్థుల హాజరు నమోదు చేయకుంటే హెచ్ఎంల జీతాల్లో కోత

 IMMS లో విద్యార్థుల హాజరు నమోదు చేయకుంటే హెచ్ఎంల జీతాల్లో కోత
ప్రైవేటు యాజమాన్యంలోని పాఠశాల అయితే రూ.10వేల ఫైన్

గురువారం నుంచి అమలు

గుంటూరు

 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల హాజరు వివరాలను
విద్యాశాఖ నిర్వహిస్తున్న యాప్ లో నమోదు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న
హెచ్ఎంలపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఈవో ఆర్.ఎస్గం గాభవానీ హెచ్చరించారు. 

హాజరు నమోదుకు సంబంధించి బుధవారం విద్యాశాఖ డైరెక్టర్వి .చిన వీరభద్రుడు వీడియో
కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. గురువారం నుంచి ప్రభుత్వ
పాఠశాలల్లో విద్యార్థుల హాజరుకు సంబంధించి ప్రతి రోజు వివరాలను సకాలంలో నమోదు
చేయకుంటే ప్రధానోపాధ్యాయుడి వేతనంలో రూ.వెయ్యి కోత విధిస్తామన్నారు. అదేవిధంగా
ప్రైవేటు యాజమాన్యంలోని పాఠశాల అయితే రూ.10వేల ఫైన్ వేస్తామన్నారు

student-attendance

Flash...   G.O.RT.No. 1243: V CHINA VEERABADRUDU AS COMMISSIONER OF SCHOOL EDUCATION , VETRISELVI AS SPD