4 Day week to employees ..Union Labor Secretary Apoorva Chandra

 ఉద్యోగులకు శుభవార్త చెప్పేందుకు సిద్ధం అవుతోంది కేంద్ర ప్రభుత్వం.. ఎందుకంటే.. ఇక, వారానికి నాలుగు పనిదినాలు మాత్రమే ఉండబోతున్నాయి.. ఉద్యోగులకు త్వరలోనే దేశవ్యాప్తంగా వారానికి నాలుగు రోజులు పని చేసే అవకాశం రానుంది అని చెబుతున్నాయి కార్మికశాఖ వర్గాలు.. కొత్త కార్మిక చట్టాల్లో ఈ అంశాన్ని పొందుపర్చినట్లు కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర వెల్లడించారు. వారంలో మొత్తంగా 48 గంటలు పనిచేయాల్సి ఉంటుంది.. అయితే, దీనిలో కూడా కొన్ని ఆప్షన్లు ఉండబోతున్నట్టు తెలుస్తోంది.. వారంలో నాలుగు రోజుల పని దినాలైతే 12 గంటల పరిమితితో అమలు చేయనుండగా.. 5 రోజుల పని దినాలు అయితే 10 గంటల పరిమితి విధించనున్నారు. ఇక ఆరు రోజుల పని దినాలు అయితే, యథావిథిగా 8 గంటల పరిమితి అమలు చేయవచ్చు. కంపెనీలకు వారానికి నాలుగు రోజుల పనిదినాలు ఎంపిక చేసుకునే అవకాశం ఉందని, అయితే, ఉద్యోగులు ఎక్కువ షిఫ్టులకు సర్దుబాటు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

అయితే, కొన్ని కంపెనీలు నాలుగు రోజుల వర్క్ షిఫ్ట్ ఇవ్వడానికి ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు కార్మికశాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర.. కొంతమంది యజమానులు వారానికి ఐదు రోజుల పని ఉండేలా చూడాలని కోరుకునే అవకాశం కూడా ఉందన్నారు. అయితే, కంపెనీలు వారానికి 48 గంటల పరిమితికి మించి పని గంటలను పెంచలేవని స్పష్టం చేశారు. నాలుగు రోజుల వర్క్‌వీక్‌ను ప్రారంభించే కంపెనీలు ఆ తర్వాత వరుసగా మూడు రోజుల సెలవులను అందించాల్సి ఉంటుందని తెలిపారు. నాలుగు, ఐదు లేదా ఆరు రోజుల పని వీక్‌ను అనుమతించే సౌలభ్యం కంపెనీలకు ఉంటుంది. కంపెనీలు మరియు ఉద్యోగులు నాలుగు రోజుల వారపు షెడ్యూల్‌కు అంగీకరించాల్సి ఉంటుందన్నారు. కంపెనీలు ఉద్యోగులకు వరుసగా మూడు రోజుల సెలవు ఇవ్వకపోతే యూనియన్లు ఈ చర్యను వ్యతిరేకిస్తాయని ఆయన అన్నారు. డిసెంబర్‌లో రూపొందించిన ముసాయిదా నిబంధనలను అనుసరించి, 2020 సెప్టెంబర్‌లో పార్లమెంటులో నాలుగు లేబర్ కోడ్‌లను కేంద్రం ఆమోదించింది. కార్మిక నియమాలకు తుది మెరుగులు దిద్దుతోందని, రాష్ట్రాలు కూడా తమ సొంత నిబంధనల ముసాయిదాతో వస్తున్నాయని వెల్లడించారు చంద్ర. 

Flash...   బడిలో భయం! కొవిడ్‌ హాట్‌స్పాట్‌గా గురుకులాలు, మోడల్‌ స్కూల్స్