బ్లాక్‌చేసిన ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను తక్షణం భర్తీ చేయాలి

బ్లాక్‌చేసిన ఉపాధ్యాయ ఖాళీలన్నింటినీ తక్షణమే భర్తీచేయాలని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి డి.మాసిలామణి డిమాండ్‌ చేశారు. ఆదివారం నగరంలోని ఓ ప్రయివేటు డిగ్రీ కళాశాలలో సంఘం జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

బ్లాక్‌చేసిన ఉపాధ్యాయ ఖాళీలన్నింటినీ తక్షణమే భర్తీచేయాలని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి డి.మాసిలామణి డిమాండ్‌ చేశారు. ఆదివారం నగరంలోని ఓ ప్రయివేటు డిగ్రీ కళాశాలలో సంఘం జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరిలో పూర్తిస్థాయిలో పాఠశాలలు ప్రారంభం అవుతాయని ప్రభుత్వం చెబుతున్నందున బ్లాక్‌చేసిన ఖాళీలను భర్తీచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ లోపు అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్లను నియమించాలన్నారు. జిల్లా అధ్యక్షుడు కె.శేషగిరి మాట్లాడుతూ అమ్మఒడి పథకానికి అర్హులైన విద్యార్థులందరికీ త్వరితగతిన సాయం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి తమ్ము నాగరాజు, జి.సత్యనారాయణ, ఎన్‌.రామబ్రహ్మం, వూటుకూరి సుబ్బారావు తదితరులు ప్రసంగించారు. సీపీఎస్‌ రద్దుతో పాటు ఉపాధ్యాయుల డిమాండ్‌లు పరిష్కరించాలన్నారు. నాయకులు పి.గౌతమ్‌ప్రసాదు, వి.శివరామకృష్ణ, టి.రేణుకారావు, జీవీ సుధీర్‌బాబు, లంకేశ్వరారవు, సంతోష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు

Flash...   Ola Electric : ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు మళ్లీ ఎప్పుడంటే!