Download voter ID from home – ECI

 ఇంట్లో నుంచే ఓటరు ఐడీ డౌన్‌లోడ్‌ చేసుకోండి

digital-voter-slip

ఇక నుంచి ఓటరు గుర్తింపు కార్డును ఓటర్లు మొబైల్‌ ఫోన్‌ ద్వారానే డౌన్‌లోడ్‌
చేసుకునే నూతన విధానాన్ని భారత ఎన్నికల సంఘం తీసుకొచ్చింది. తమ రిజిస్టర్డ్‌
మొబైల్‌ ద్వారా పీడీఎఫ్‌ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్‌ చేసుకొని ప్రింట్‌ తీసుకోవడంతో
పాటు మొబైల్‌ ఫోన్‌లోనూ స్టోర్‌ చేసుకునే వెసులుబాటును కల్పించింది. ఇప్పటివరకు
ఓటరు గుర్తింపు కార్డును సమీపంలోని మీ-సేవ కేంద్రాల ద్వారానే పొందాల్సి ఉండేది.
జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈ నెల 25న ఈ-ఎపిక్‌(ఎలక్రానిక్‌: ఫొటో ఐడెంటిటీ
ఓటరు కార్డు) కార్యక్రమాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించబోతోంది. ఓటరు తమ
రిజిస్టర్డ్‌ మొబైల్‌లోనే ఓటరు కార్డును డౌన్‌లోడ్‌ చేసుకొని ఎక్కడైనా ప్రింట్‌
తీసుకోవచ్చు

2021 జనవరిలో ప్రకటించిన ఓటర్ల జాబితాలో కొత్తగా నమోదైన యువ ఓటర్లకు తొలుత ఈ
అవకాశం కల్పించారు. వీరు తమ రిజిస్టర్డ్‌ ఫోన్‌ నంబర్‌ ద్వారా ఈ నెల 25 నుంచి 81
వరకు ఈ-ఎపిక్‌ కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 1 నుంచి ఓటర్లందరూ
ఈ-ఎపిక్‌ కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. “ఈ-ఓటర్‌ హువా డిజిటల్‌, క్లిక్‌ ఫర్‌
ఏపిక్”‌ అనే పేరుతో పేద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఎన్నికల
అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. పోర్టల్:
http://voterportal.eci.gov.in,
NVSP: https://nsvp.in ద్వారా ఎలక్ట్రానిక్ ఓటరు
గుర్తింపు కార్డు డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. కాగా, ఈ నెల 25న జాతీయ ఓటర్ల
దినోత్సవం సందర్భంగా ప్రజాప్రతినిధులు, ఎన్జీఓలను భాగస్వాములను చేసి కొత్త ఓటర్ల
నమోదుకు విస్తృత ప్రచారం చేయాలని ఎన్నికల సంఘం పేర్కొంది

Flash...   How to get Adhar PVC card online