Transfer of Officers and Collectors during Elections

 ఏపీ ఎన్నికల సంఘం ప్రత్యక్ష చర్యలు.. వారంతా బదిలీ

transfer-of-officers

విజయవాడ : ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం
సమాయత్తమవుతోంది. శనివారం నాడు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర ఎన్నికల
సంఘం ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు జగన్ సర్కార్ మాత్రం ఎన్నికలు ఎలా ఆపాలనే
ప్రయత్నంలో నిమగ్నమైంది. ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యక్ష చర్యలకు
సిద్ధమైంది. 9 మంది అధికారులను ఎన్నికల విధుల నుంచి ఎస్ఈసీ తొలగించింది. గుంటూరు,
చిత్తూరు కలెక్టర్లను బదిలీ చేస్తూ ఎస్ఈసీ ప్రొసీడింగ్స్ జారీ చేసింది. తిరుపతి
అర్బన్ ఎస్పీ, పలమనేరు, శ్రీకాలహస్తి డీఎస్పీలను కూడా ఎస్ఈసీ తొలగించింది.
అంతేకాకుండా మాచర్ల, పుంగనూరు, రాయదుర్గం, తాడిపత్రి సీఐలను తొలగిస్తున్నట్లు
ఎన్నికల సంఘం తెలిపింది. తొలగించిన అధికారుల స్థానంలో కొత్త అధికారుల పేర్లు
పంపాలని సీఎస్‌కు ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

ఎన్నికల నోటిఫికేషన్ రేపు ఇవ్వనున్న నేపథ్యంలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్
అధికారులతో వరస భేటీలు అవుతున్నారు. ఇవాళ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో
నిమ్మగడ్డ రమేష్‌కుమార్ భేటీ అయ్యారు. ఆ తర్వాత పంచాయతీరాజ్ అధికారులు నిమ్మగడ్డ
భేటీ కావాల్సి ఉంది. అయితే ఎస్ఈసీ ముందు పంచాయతీరాజ్‌శాఖ అధికారులు హాజరుకాలేదు

Flash...   ప్రారంభమైన ఏపీ కేబినెట్ సమావేశం..