బదిలీల్లో బయటపడుతున్న అక్రమాలు..అక్రమ బదిలీలకు ఇదిగో సాక్ష్యం..!

 ఉపాధ్యాయ బదిలీల్లో బయటపడుతున్న అక్రమాలు.. కానీ అధికారులు మాత్రం..

చిదంబర రహస్యం!

గత బదిలీల జాబితాలు డీఈఓ బ్లాగ్‌లో ఉంచటంలో నిర్లక్ష్యం 

డీఈఓ ఆదేశించినా ఫలితం అంతంతే 

ఫైనల్‌ లిస్టులోనూ అనేక మంది అక్రమార్కులు

లోపాయికారి ఒప్పందాల్లో అధికారులు ? 

అనంతపురం విద్య, డిసెంబరు 13: గత బదిలీల జాబితాలను డీఈఓ బ్లాగ్‌లో అందుబాటులో ఉంచకుండా నిర్లక్ష్యం, జాప్యం చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీని వెనుక లోపాయికారి ఒప్పందాలు ఉన్న ట్టు ఆరోపణలు వస్తున్నాయి. లిస్టు లు మా యం కావ టం కొందరు ఇంటి దొంగల పనేననే వాదనలు వినిపిస్తున్నాయి. ఈనెల 11న బదిలీల ఫైనల్‌ లిసు ్టలు వెలువ డ్డాయి. వీటిలోనూ అనేక మంది అక్రమార్కు లు, దొడ్డిదారి లో వచ్చిన వారున్నారు. అయితే వారి  గుట్టు బయట పడాలంటే 2009, 2012, 2015, 2017 ఏడాదిల్లో బదిలీ జాబితాలు బయట పడాలి. కానీ కొందరు వీటిని బయట పెట్టకుండా అడ్డుకుంటున్నట్లు సమాచారం.

అధికారి ఆదేశించినా….!

ఈ ఏడాది బదిలీల్లో భారీగానే ప్రిఫరెన్సియల్‌, స్పౌజ్‌ కేటగిరీల్లో కొందరు ఉపాధ్యాయులు లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేశారు. పైగా గతంలో ఆయా కేటగిరీల్లో పాయింట్లు పొంది తాజాగా లబ్ధికి నడుంబిగించారు. ఈ క్రమంలో తప్పుడు సమాచారంతో కొందరు, బోగస్‌ సర్టిఫి కెట్లు, ధ్రువీకరణ పత్రాలతో మరికొందరు టీచర్లు, నాయ కులు భారీగానే దరఖాస్తు చేశారు. వీరిని వెతికేందుకు  19 బృందాలను డీఈఓ నియమించినా…కొందరు ఇంటి దొంగల మూలంగా చాలా మంది సేఫ్‌గానే తప్పించుకు న్నారు. దీనిపై గత నెల 30న ‘ఆశించిన ఫలితం ఏదీ’ ? శీర్శికన ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితం కావడంతో డీఈఓ దీనిపై దృష్టి సారించారు. ఆయన అదే రోజు అధికారులతో సమావేశం పెట్టి గత బదిలీల లిస్టులు వెంటనే పెట్టాలంటూ ఆదేశించారు. ఆయన ఆదేశించిన 48 గంటల తర్వాత కానీ కొన్ని లిస్టులు బయటకు రా లేదు. అందునా కొందరి పేర్లు తొలగించి డీఈఓ బ్లాక్‌ స్పాట్‌లో ఉంచారు. మిగిలినవి మాయం చేశారు.

Flash...   AP TET GUIDELINES : GO MS 23 Dt:17.03.2021

ఈ లిస్టులు ఏమైౖనట్టు….

2009, 2012, 2015, 2017 సంవత్సరాల్లో జరిగిన బదిలీలకు సంబంధించి ప్రిఫరెన్సియల్‌, స్పౌజ్‌తోపాటు ప్రత్యేకపాయింట్లు పొందిన ఉపాధ్యాయుల జాబితాలు పెట్టాలని వందలాది మంది టీచర్లు, సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. అక్రమాలు బయట పడాలన్నా దొడ్దిదారిలో ఈ ఏడాది బదిలీల్లో లబ్ధికి కుయుక్తులు పన్నుతున్న వారి గుట్ట బయటపడాలంటే అవి ప్రదర్శిం చాలి. అయితే డీఈఓ ఆదేశాలిచ్చినా….డీఈఓ బ్లాగ్‌లో కేవలం 2009, 2012, 2017 సంవత్సరాలకు సంబంధించి స్పౌజ్‌ వాడిన టీచర్ల లిస్టులు, 2015,2017కు సంబంధించి న ప్రిఫరెన్సియల్‌ కేటగిరీ వాడిన టీచర్ల లిస్టులు మా త్రమే ఉంచారు. వీటిలో కూడా అరకొర సమాచారం ఉంచి, కొం దరి పేర్లు తొలగించి ఉంచారన్న విమర్శలు వినిపిస్తున్నా యి. డీఈఓ ఆఫీ్‌సలోని కొందరు ఇంటి దొంగలు కావాలనే కొన్ని లిస్టులు మాయం చేశారన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఫైనల్‌ సీనియారిటీ జాబితాలు ప్రకటించారు. ఈ క్రమంలో గత బదిలీల లిస్టులు బయటకు వస్తే….. మరి కొందరు అక్రమార్కులు బయట పడే అవకాశం ఉంది. మరి విద్యాశాఖ ఉన్నతాధికారులు ఏ మేరకు చర్యలు తీ సుకుంటారో…అక్రమార్కులకు ఎలాచెక్‌ పెడతారో చూ డాలి. 

అక్రమ బదిలీలకు ఇదిగో సాక్ష్యం..!

2013లో ప్రిఫరెన్సియల్‌ కోటాలో లబ్ధి . ప్రస్తుత బదిలీల్లోనూ దరఖాస్తు

ఓ మహిళా టీచర్‌ నిర్వాకం

అనంతపురం విద్య, డిసెంబరు 13: ఉపాధ్యాయ బదిలీల్లో అక్రమాలకు సాక్ష్యాలు బయటపడుతున్నా.. జిల్లా అధికారులు కళ్లు మూసుకుంటున్నారు. జిల్లా కేంద్రం దగ్గరి  స్థానాలు పొందేందుకు టీచర్లు రకరకాల అడ్డదారులను ఎంచుకుంటున్నారు. కొందరు సంఘాల నాయకులు, టీచర్లు గతంలో స్పౌజ్‌, ప్రిఫరెన్సియల్‌ కింద లబ్ధి పొందినా.. మళ్లీ.. మళ్లీ.. వాడుకుంటున్నారు. చెన్నేకొత్తపల్లి మండలంలో పనిచేస్తున్న ఓ మహిళా టీచర్‌ గతంలో ప్రిఫరెన్సియల్‌ కేటగిరీలో లబ్ధి పొంది కూడా ఈ ఏడాది బదిలీల్లో దరఖాస్తు చేసుకోవటం, ఆ మేరకు ఆమెకు పాయింట్లు దక్కటం విమర్శలకు తావిస్తోంది. గతంలో లబ్ధి పొందిన టీచర్‌కు ఈ దఫా బదిలీల్లో మళ్లీ అదే ప్రిఫరెన్సియల్‌ కేటగిరీలో అన్‌మ్యారీడ్‌ కింద 5 పాయింట్లు పడటం వెనుక కొందరు విద్యాశాఖాధికారుల హస్తం కూడా ఉన్నట్లు సమాచారం.

Flash...   ICC T20 World Cup: టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్‌ విడుదల

అప్పుడు.. ఇప్పుడు కూడా..

చెన్నేకొత్తపల్లిలోని ఓ పాఠశాలలో పనిచేసే మహిళా ఎస్‌జీటీ 2013లో బదిలీల్లో ప్రిఫరెన్సియల్‌ కేటగిరీ (పీసీ) కింద లబ్ధి పొందింది. ప్రస్తుత బదిలీల్లోనూ అవివాహిత కింద ఇదే కోటాలో దరఖాస్తు చేసింది. దీంతో సీనియారిటీ జాబితాలో మళ్లీ 5 పాయింట్లు నమోదయ్యాయి. ప్రిఫరెన్సియల్‌, స్పౌజ్‌ తదితర కేటగిరీల్లో ఒకసారి లబ్ధిపొందిన తర్వాత 8 ఏళ్ల వరకు అవకాశం ఉండదు. 2013లో ప్రయోజనం పొందినట్లు ఆమె సర్వీసు రిజిస్టర్‌ (ఎస్‌ఆర్‌)లో సైతం నమోదు చేశారు. ప్రస్తుతం దరఖాస్తు చేసుకోవటానికి ఆమె అనర్హురాలైనా మళ్లీ అదే కేటగిరీలో 5 పాయింట్లు పడేలా చేయటం చూస్తుంటే దీని వెనుక కొందరు అధికారుల హస్తం కూడా ఉందన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆమె తన పాయింట్లు తీసేయాలని స్థానిక మండల విద్యాశాఖాధికారులను కలిసినట్లు తెలుస్తోంది. తర్వాత ఏం జరిగిందో కానీ, ఈ ఏడాది బదిలీల్లో సైతం ఫైనల్‌ సీనియారిటీ జాబితాలో ఆమెకు 5 పాయింట్లు కేటాయించటం విమర్శలకు తావిస్తోంది. మరి ఈ వ్యవహారంపై జిల్లా ఉన్నతాధికారులు ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

1 Comment

  1. gathamlo minister ki lakshallo lanchalu ichi general transfers tho sambandham lekunda vellina upadhyayula gurinchi ee patrikalu enduku rayavu. andulo kooda union nayakulunnaru kada. vicharana jaripinchamani koradam ledu enduku. aa minister evaro andariki telusu. idi abadhamani okkanayakudaina khandinchagaladaa?

Comments are closed