అమ్మాయిలకు ఏడాదికి రూ.50000 స్కాలర్‌షిప్‌‌.. దరఖాస్తు చేసుకోండిలా..!

ప్రగతి స్కాలర్‌షిప్‌ స్కీమ్‌ 2020-21

చదువుకునే తెలివితేటలు ఉండి.. ఆర్థికంగా ఆసరా లేక చదువుకు దూరమవుతున్న అమ్మాయిలకు
గుడ్‌న్యూస్‌. ముఖ్యంగా సాంకేతిక విద్య దిశగా మహిళలు అడుగులేస్తే అవకాశాలను
అందిపుచ్చుకోవడం తేలికవుతుంది. అందుకే అమ్మాయిలకు ఆర్థికంగా అండగా నిలవడానికి
అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) డిప్లొమా, ఇంజినీరింగ్‌ చదువుతున్న
అమ్మాయిల కోసం స్కాలర్‌షిప్‌లు ఏర్పాటుచేసింది. ప్రగతి స్కాలర్‌షిప్‌ల పేరిట
ప్రతి ఏడాది పదివేల మందికి వీటిని అందజేస్తోంది.

AICTE-Pragati-Scholarship-for-Girls-2019

అర్హత:

డిప్లొమా లేదా ఇంజినీరింగ్‌ ఫస్టియర్‌, అలాగే లేటరల్‌ ఎంట్రీలో డిప్లొమా లేదా
ఇంజినీరింగ్‌ ద్వితీయ సంవత్సరం కోర్సుల్లో చేరినవారు ప్రగతి స్కాలర్‌షిప్‌లకు
దరఖాస్తు చేసుకోవచ్చు. డిప్లొమా స్థాయిలో 5000 మందికీ.. డిగ్రీ (ఇంజినీరింగ్‌)లో
5000 మందికీ వీటిని అందిస్తారు.

అదనపు నిబంధనలు:

ఒక కుటుంబం నుంచి ఇద్దరు బాలికలు మాత్రమే ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులు.

తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.8 లక్షల కంటే తక్కువగా ఉండాలి. ఇందుకు సంబంధించిన
ప్రూఫ్‌ జతచేయాలి.

ఏఐసీటీఈ గుర్తింపు పొందిన సంస్థల్లో డిప్లొమా లేదా బీటెక్‌ కోర్సులో చేరి ఉండాలి.

సంబంధిత కోర్సులో ఫస్టియర్‌ లేదా లేటరల్‌ ఎంట్రీలో ద్వితీయ సంవత్సరంలో
చేరినవాళ్లే ఈ స్కాలర్‌షిప్పునకు అర్హులు.

స్కాలర్‌షిప్‌ మొత్తం:

ప్రగతి స్కాలర్‌షిప్‌కు ఎంపికైతే ఏడాదికి రూ.50 వేల చొప్పున డిప్లొమా వాళ్లకు
మూడేళ్లు.. ఇంజినీరింగ్‌ కోర్సులు చదువుతున్న వారికైతే నాలుగేళ్లు చెల్లిస్తారు.
లేటరల్‌ ఎంట్రీలో చేరినవారికి డిప్లొమా అయితే రెండేళ్లు, ఇంజినీరింగ్‌ అయితే
మూడేళ్లపాటు ఇవి అందజేస్తారు. ఎంపికైనవారి బ్యాంకు ఖాతాలోకి నేరుగా ఏటా రూ.యాభై
వేలను జమ చేస్తారు. దీన్ని ఫీజు, వసతి, పుస్తకాలు, కంప్యూటర్‌…తదితర ఖర్చుల
కోసం వెచ్చించుకోవచ్చు. ముందు సంవత్సరాల చదువులో చూపిన ప్రతిభ ఆధారంగా తర్వాతి
సంవత్సరాలకు వీటిని కొనసాగిస్తారు.

తెలుగు రాష్ట్రాల కోటా:

దేశవ్యాప్తంగా అందించే ఈ స్కాలర్‌షిప్‌లకు రాష్ట్రాలవారీ కోటా విధించారు. దీని
ప్రకారం ఏపీలో డిప్లొమా చదువుతున్న విద్యార్థినుల్లో 318 మందికి, తెలంగాణలో 206
మందికి వీటిని అందిస్తారు. అలాగే ఇంజినీరింగ్‌ విభాగంలో ఏపీ నుంచి 566 మందికి,
తెలంగాణ నుంచి 424 మందికి ఇవి అందజేస్తారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ప్రభుత్వ
నిబంధనల మేరకు కేటాయింపులు ఉంటాయి.

Flash...   Minutes of the video conference held regarding the implementation of RPS 2022

ఎంపిక విధానం:

డిప్లొమా అభ్యర్థులైతే పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్‌ ఆధారంగా వీటికి
ఎంపిక చేస్తారు. పదో తరగతికి డిప్లొమాలో చేరడానికి మధ్య రెండేళ్ల కంటే ఎక్కువ
గ్యాప్‌ ఉండకూడదు. ఇంజినీరింగ్‌లో చేరినవారైతే ఇంటర్‌లో సాధించిన మార్కుల ఆధారంగా
ఎంపిక చేస్తారు.

ముఖ్య సమాచారం:

దరఖాస్తులు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్‌లోనే పూర్తిచేయాలి.
జతచేయాల్సిన సర్టిఫికెట్లను పీడీఎఫ్‌ విధానంలో స్కాన్‌చేసి మెయిల్‌ చేయాలి.

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: డిసెంబరు 31, 2020

వెబ్‌సైట్‌:
https://scholarships.gov.in/