TAMANNA – Try And Management Aptitude and Natural Abilities

విద్యార్థులకు సామర్థ్య పరీక్ష నిర్వహణ

ప్రతి ఒక్కరూ ఒక్కో రంగంలో శక్తి సామర్థ్యాలు కనబరుస్తుంటారు. విద్యార్థుల కూడా
వివిధ రకాల అభిరుచులు, ఆసక్తులు కలిగి ఉంటారు. వాటికి అనుగుణంగా విద్యార్థుల
భవితకు ఉపయోగపడేలా బోధన చేపడితే విద్యార్థులు రాణించేందకు అవకాశం ఉంటుంది. పాఠశాల
దశ నుంచే పిల్లలను ఉన్నతస్థాయిలో తీర్చిదిద్దేందుకు కేంద్ర మానవవనరుల శాఖ
సహకారంతో తమన్నా యాప్టిట్యూడ్‌ పరీక్షను రూపొందించారు. ఉన్నత పాఠశాలల్లో 9, 10
తరగతులు, ఇంటర్మీడియట్‌ స్థాయిలో ఈ పరీక్షను ఈ నెల నాలుగో వారంలో నిర్వహించాలని
ఉన్నతాధికారులు ఇప్పటికే ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపళ్లకు పలు
సూచనలు చేశారు. అందుబాటులో ఉన్న సాంకేతిక వనురులను బట్టి ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో
పరీక్ష నిర్వహించనున్నారు*.

పరీక్ష విధానం ఇలా..

టీఏఎమ్‌ఎఎన్‌ఎన్‌ఏ (తమన్నా) ట్రై అండ్‌
మేజర్‌ యాప్టిట్యూడ్‌ అండ్‌ నేచురల్‌ ఎబిలిటీస్‌ పరీక్ష ద్వారా విద్యార్థుల సహజ
సామర్థ్యాలను కొలవనున్నారు. కేంద్ర మానవ వనరుల శాఖ, సీబీఎస్‌ఈ, ఎన్‌సీఈఆర్టీ
సంయుక్తంగా రూపొందించిన ఈ యాప్‌ ద్వారా విద్యార్థుల సామర్థ్ల్యాలను కొలవాలని
విద్యాశాఖ, సమగ్రశిక్ష శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థికి సాధారణ విద్య
అవసరమా? వృత్తి సంబంధమైన విద్యవైపు ఆసక్తి చూపుతున్నాడా అనేది పరీక్ష ద్వారా
ఉపాధ్యాయులు తెలుసుకుని దానికి అనుగుణంగా తదుపరి కార్యాచరణ చేపట్టనున్నారు.

పిల్లలకు ఉపయుక్తం..

పరీక్ష నిర్వహణకు సంబంధించి ఆదేశాలు వచ్చాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు
ఏర్పాట్లు చేస్తాం. విద్యార్థుల భవితకు ఇది ఎంతగానో ఉపయుక్తం. కార్యక్రమ
నిర్వహణకు ఎమ్వీవోలు, ప్రధానోపాధాయులు, ఉపాధ్యాయులు సహకారించాలి  –
ఆర్‌.శ్యాంసుందరావు, ఎస్‌ఎస్‌ ఏఎంవో

పక్కాగా ఏర్పాట్లు..

విద్యా వ్యవస్థలో ఈ పరీక్ష ద్వారా ఓ సరికొత్త మార్పు సాధ్యం కానుంది. పిల్లల
సామర్థ్యాల ఆధారంగా కెరీర్‌ను ఎంచుకోవటానికి అవకాశం ఉంటుంది. పక్కాగా పరీక్ష
నిర్వహణకు ఆదేశాలు జారీ చేశాం.  ఎం.సౌజన్య, పరీక్ష రాష్ట్ర నోడల్‌ అధికారి

Downloads:

1. Tamannaa Guide for Teacher

2. Tamannaa Technical Manual

Flash...   ఎలక్షన్ కోడ్ వచ్చేసింది.. ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?

3. Tamannaa Test Booklet