ప్రపంచంలో చచ్చి బతికిన తొలి మనిషి

ఒకసారి చనిపోయాక బతికిన వారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. కానీ ఇక్కడ అద్భుతమే
జరిగింది. ఏకంగా 45 నిమిషాల పాటు చనిపోయిన మనిషి బతికి బట్టకట్టాడు. వైద్య
శాస్త్రంలోనే దీన్నో మిరాకల్ గా అభివర్ణిస్తున్నారు.

అమెరికాకు చెందిన మైకేల్ నాపిన్కీ అనే పర్వతారోహకుడి గుండె 45 నిమిషాలు ఆగిపోయి..
మళ్లీ కొట్టుకోవడం విశేషంగా మారింది. ఇలాంటి వింత ఎప్పుడూ జరగలేదని వైద్యులు కూడా
ఆశ్చర్యపోతున్నారు.

 -8.9 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే మౌంట్ రెయినైర్ నేషనల్ పార్క్ కు మైకేల్
వెళ్లాడు. పర్వతారోహణ చేస్తుండగా మంచు కూలి అతుడు కూరుకుపోయాడు.

గమనించిన స్నేహితులు ఫిర్యాదు చేయడంతో వెంటనే సిబ్బంది అధికారులు రంగంలోకి దిగి
మైకేల్ ను వెలికితీశారు. అయితే అప్పటికే అతడి గుండె కొట్టుకోవడం ఆగిపోయింది.

ఆస్పత్రికి తరలించగా వైద్యులు గుండెను తిరిగి పనిచేయించేందుకు ప్రయత్నించారు.
దాదాపు 45 నిమిషాల తర్వాత మళ్లీ అతడు బతికాడు. 2 రోజుల అనంతరం సృహలోకి వచ్చాడు.
ఇలా ప్రపంచంలో చచ్చి బతికిన తొలి మనిషి ఇతడే కావచ్చు మరీ

Flash...   Collecting data from aided Schools - Revised instructions and online form