పెండింగు జీతం జనవరిలోనే చేతికి

ఆoధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా కు సంబంధించి ఇవ్వాల్సిన పెండింగు జీతాలపై ఈ రోజు లేదా రేపు ఉత్తర్వులు వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగుల చేతికి జీతాలు జనవరిలోనే అందుతాయని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి కరోనా కారణంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో ప్రభుత్వం సగం జీతమే చెల్లించింది. 

ఆ మొత్తాన్ని ప్రస్తుతం అయిదు విడతల్లో తిరిగి చెల్లించాలని నిర్ణయించారు. అయితే తొలి రెండు నెలలు వారి జీతాల నుంచి మినహాయించాల్సిన వాటికే కేటాయించనున్నారని తెలిసింది. ఐటీ, జీఎస్ఎల్, ఇన్యూరెన్సు జీపీఎఫ్ వంటి వాటి కోసం ఎంతవుతుందో లెక్కించి నవంబర్, డిసెంబర్ నెలల్లో వాటికి జమ చేస్తారు. 

మిగిలిన మొత్తాన్ని మూడు వాయిదాల్లో ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది దీన్ని బట్టి జనవరి, ఫిబ్రవరి , మార్చి నెలల్లో ఉద్యోగుల ఖాతాలకు ఆ మొత్తాలు చేరతాయి. పెన్షనర్లకు రెండు లేదా మూడు విడతల్లో చెల్లించే అవకాశం ఉందని చెబుతున్నారు. జీవో విడుదలైన తర్వాతే పూర్తి స్పష్టత వస్తుంది.

Flash...   Postponement of Jagananna Vidya kanuka - press note