రోజూ గంజి తాగితే బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు…

ఈ రోజుల్లో దాదాపు అందరూ కుక్కర్‌లోనే వంటలు చేస్తున్నారు. కానీ, పాత రోజుల్లో
బియ్యాన్ని పాత్రల్లో ఉడికించి గంజిని వడపోసేవారు. ఆ తర్వాత ఆ గంజిలో కాస్త
ఉప్పు, నిమ్మ రసం కలిపి తాగేసేవాళ్లు. దీంతో బియ్యంలో ఉండే పోషకాలేవీ బయటకు
పోకుండా శరీరానికి చక్కగా అందేవి. అయితే.. కాలక్రమేణా గంజిని పక్కన పెట్టేశారు.
పాత్రలో గంజిని వంచినా వృథాగా పడేస్తున్నారు. అయితే గంజి వల్ల ఎన్నో ఆరోగ్య
ప్రయోజనాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం…

-> ఇంట్లో మజ్జిగ అందుబాటులో లేకపోతే గంజిని అన్నంలో కలుపుకుని తాగండి. కడుపు
నిండుగా ఉండటమే కాకుండా శరీరాన్ని కూల్‌గా ఉంచుతుంది.

-> గంజి తాగడం వల్ల జ్వరం తగ్గుముఖం పట్టేందుకు సహకరిస్తుంది. చర్మాన్ని
మృదువుగా ఆరోగ్యంగా ఉంచేందుకు గంజి తోడ్పడుతుంది.

-> గంజి.. చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. చర్మ వ్యాధులను తగ్గిస్తుంది. ముఖంపై
గుంతలు ఏర్పడకుండా ఉండలంటే గంజిని తీసుకోండి.

-> గంజి శరీరాన్ని, మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. శరీర ఉష్ణోగ్రతను
నియంత్రిస్తుంది.

-> నీటిలో కాసింత గంజిని కలిపి స్నానం చేస్తే రోజంతా ఉత్సాహంగా ఉంటారట.

-> గంజిలో బోలెడన్ని ఖనిజాలు, విటమిన్లు, అమైనో ఆమ్లాలు ఉంటాయి.

-> గంజిలోని కార్బోహైడ్రేట్లు శరీరానికి మంచి శక్తినిస్తాయి. గంజి జీర్ణ
వ్యవస్థను మెరుగు పరుస్తుంది. మలబద్దకాన్ని దూరం చేస్తుంది.

Flash...   PROMOTION LISTS SOFTWARES (EXCEL) FOR 2020-21.