SBI గుడ్ న్యూస్.. లోన్ తీసుకున్న వారు 2 ఏళ్లు EMI కట్టక్కర్లేదు

 SBI గుడ్ న్యూస్.. లోన్ తీసుకున్న వారు 2 ఏళ్లు ఈఎంఐ కట్టక్కర్లేదు.. ఇలా
అప్లై చేసుకోండి!

దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తాజాగా తన కస్టమర్లకు
అదిరిపోయే శుభవార్త అందించింది. కరోనా వైరస్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు
ఎదుర్కొంటున్న వారికి ఊటర కలిగే నిర్ణయం తీసుకుంది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా
(RBI) స్కీమ్‌కు అనుగుణంగా రిస్ట్రక్చరింగ్ బెనిఫిట్‌ను రిటైల్ కస్టమరలకు
అందిస్తోంది.

బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్న వారికి ఒక అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. నెల
నుంచి 24 నెలలపాటు అంటే 2 ఏళ్లు పాటు ఈఎంఐ మారటోరియం ప్రయోజనాన్ని కల్పిస్తోంది.
హౌసింగ్ లోన్, ఇతర సంబంధిత రుణాలు, ఎడ్యుకేషన్ లోన్, వెహికల్ లోన్, పర్సనల్ లోన్
తీసుకున్న వారికి ఈ ప్రయోజనం అందుబాటులో ఉంది.

కస్టమర్ భవిష్యత్ ఆదాయం ప్రాతిపదికన స్టేట్ బ్యాంక్ వారికి రిస్ట్రక్చరింగ్
బెనిఫిట్ అందిస్తోంది. ఇతర కస్టమర్లతో పోలిస్తే రిస్ట్రక్చరింగ్ ఆఫర్ ఎంచుకున్న
వారు 0.35 శాతం మొత్తాన్ని అదనంగా బ్యాంక్‌కు చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబర్ 24
వరకు లోన్ రిస్ట్రక్చరింగ్ ప్రయోజనం అందుబాటులో ఉంటుంది. ఈలోపు దీనికి అప్లై
చేసుకోవాలి.

లోన్ రిస్ట్రక్చరింగ్ బెనిఫిట్ పొందాలని భావించే వారు ఎస్‌బీఐ పోర్టల్‌కు
వెళ్లాలి. అక్కడ అకౌంట్ నెంబర్ వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ
రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దీన్ని ఎంటర్ చేయాలి. ఇతర అవసరమైన
సమాచారం అందించాలి. దీంతో మీకు ఎంత ఎలిజిబిలిటీ ఉందో తెలుస్తుంది.

ఇలా అన్ని వివరాలు ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఒక రెఫరెన్స్
నెంబర్ మెసేజ్ వస్తుంది. దీని వాలిడిటీ 30 రోజులు ఉంటుంది. మీరు మీ బ్యాంక్
బ్రాంచుకు వెళ్లి ఈ నెంబర్‌ చెప్పాలి. అలాగే డాక్యుమెంట్లు అందించాలి. వీటి
వెరిఫికేషన్ తర్వాత మీ రిస్ట్రక్చరింగ్ పూర్తి అవుతుంది.

Flash...   APకేబినెట్ కీలక నిర్ణయాలు.. రైతులకు శుభవార్త