కరోనా కారణంగా మూతపడ్డ స్కూళ్లను తెరిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ పాఠశాలను ప్రారంభించే ఆలోచనలో ఉన్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. దీనిపై అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని.. అక్టోబర్ 5 నుండి స్కూల్స్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.
అయితే ఉన్నతాధికారుల సూచనల మేరకు అన్‌లాక్ 5 మార్గదర్శకాలు వచ్చిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. విద్యార్థులకు అందించే విద్యా కానుకను ఇప్పటికే సిద్ధం చేశామని మంత్రి స్పష్టం చేశారు. కరోనా అనంతరం కాలేజీలు, యునివర్సిటీల్లో అనేక మార్పులు చోటుచేసుకోనున్నాయని తెలిపారు. కరోనా తర్వాత పరిస్థితులు అంచనా వేసి అనేక మార్గదర్శకాలు సిద్దం చేశామని పేర్కొన్నారు.