September 1 నుంచి బయోమెట్రిక్‌ హాజరు తప్పనిసరి

  ఈనాడు డిజిటల్‌,
అమరావతి: గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగులు సెప్టెంబరు 1 నుంచి విధిగా బయోమెట్రిక్‌ హాజరు నమోదు చేయాలని గ్రామ/వార్డు సచివాలయం శాఖ ఆదేశించింది. దీని ఆధారంగానే వేతనాల చెల్లింపు ఉంటుందని స్పష్టం చేసింది. 

ఆ మేరకు బయోమెట్రిక్‌ హాజరుతో వేతనాల చెల్లింపును అనుసంధానించాలని పురపాలక కమిషనర్లు, ఎంపీడీవోలకు సూచించింది. బయోమెట్రిక్‌ హాజరు అమలులో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలుంటాయని స్పష్టం చేస్తూ సోమవారం ఉత్తర్వులనిచ్చింది.

Flash...   Orientation programme on PRASHAST App