జనవరి నాటికి కరోనాకు చెక్ పడుతుందా ?

హ్యూస్టన్ : వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే కరోనా వైరస్ నియంత్రణ సాధ్యపడుతుందని ప్రజలు బలంగా విశ్వసిస్తున్న విషయం తెలిసిందే. కాగా… వచ్చే సంవత్సరం ప్రారంభం నాటికి ఔషధ తయారీ సంస్థల నుంచి వ్యాక్సిన్ సాధ్యమవుతుందని తాజాగా అమెరికా వైద్య నిపుణుడు ఆంటోనీ ఫౌచీ  చెప్పారు. ‘రాయిటర్స్’ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు.

ఎక్కువ స్థాయి, సామర్థ్యం కలిగిన వ్యాక్సిన్, తగిన వైద్య సేవల లభ్యత వల్ల వైరస్ ను కట్టడి చేయడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోన్న నేపధ్యంలో… దానిని పూర్తిస్థాయిలో అదుపు చేయవచ్చని తాను భావించడం లేదని,వ్యాక్సిన్, తగిన వైద్య సేవలు లభ్యమైతే మాత్రం వైరస్ ను చాలావరకు అదుపు చేయడం సాధ్యమేనని చెప్పారు. కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ఈ స్థాయిలో వైరస్ వ్యాప్తి చెందదని, వైరస్ వ్యాప్తి జరిగినా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపదని పేర్కొన్నారు. 

Flash...   AMENDMENTS TO BE INCORPORATED IN THE RULES BOOK AS ACCEPTED BY THE NATIONAL COUNCIL ON 24.11.2019.