SSC, ఇంటర్ బోర్డుల విలీనం

నూతన విద్యా విధానంలో కలిపివేయాలని సిఫారసు
క్లాస్ 11, క్లాస్ 12గా ఇక ఇంటర్
ఉద్యోగుల విలీనం కూడా తప్పదు
సెకండరీ స్కూలుగా 9 నుంచి 12వరకు
10, 12 తరగతులకు బోర్డు ఎగ్జామ్స్
  నూతన విద్యా విధానంలో భాగంగా ఎస్సెస్సీ బోర్డు, ఇంటర్ బోర్డులు విలీనం కానున్నాయి. 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు సెకండరీ విద్య గా పరిగణించి ఈ తరగతి లకు నిర్వహించే పరీక్షలను ఒకే బోర్డు ద్వారా జరపాలని కేంద్ర ప్రభు త్వం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.  పదవ తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షలు నిర్వహిస్తారు. కానీ ఎస్సెస్సీ,ఇంటర్ బోర్డు లో విలీనం  చేసి ఒకే బోర్డు ద్వారా 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకుపరీక్షలుజరపాలని నూతన విద్యా విధానం ముసాయిదాలో పేర్కొంది ప్రస్తుతం ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఆ తర్వాత రెండేళ్ళ ఇంటర్మీడియట్ కోర్సుల్లో మార్పులు చేపట్టాలని ప్రతిపాదిం చిన సంగతి తెలిసిందే. ఉత్తరాది రాష్ట్రాల తరహాలో దేశమంతా ఇకనుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరాన్ని 11వ తరగతి ద్వితీయ సంవత్సరాన్ని 12వ తరగతి పిలుస్తారు. ఇంటర్మీడియట్ అనే పదాన్ని పూర్తిగా రద్దు చేసి12 తరగతులుగా వ్యవహరించాలని నూతనవిద్యా విధానం స్పష్టం చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలకు ఏటా ఐదున్నర లక్షల మంది, ఇంటర్మీడియట్ పరీక్షలకు తొమ్మిదిన్నర లక్షల మంది మొత్తం 15 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఎస్సెస్సీబోర్డు ప్రస్తుతం పాఠశాల విద్యాశాఖ పరిధిలో పని చేస్తుండగా ఇం టర్ బోర్డు ఉన్నత విద్యా శాఖ పరిధిలో ఉంది. ఈ రెండు బోర్డులను విలీనం చేసి తద్వారా ఒకే గొడుగు కిందకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఎస్సెస్సీబోర్డు డైరెక్టర్ గా పాఠశాల విద్యాశాఖకు చెందిన అదనపు డైరెక్టర్హోదాలో అధికారిని నియమించి ఆయన చేత విధులునిర్వహిస్తున్నారు. ఈ బోర్డులో డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్ తో పాటు దాదాపు 200 మంది ఉద్యోగులుపని చేస్తున్నారు. ఒక్కో జిల్లాకు ఒక డిప్యూటీ కమిషనర్ఒక అసిస్టెంట్ కమిషనర్, ఇద్దరు లేదా ముగ్గురు సూప రింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు విధులు నిర్వహిస్తున్నారు
తెలంగాణాలోని 33 జిల్లాలకు ప్రత్యేకంగా ఎస్సెస్సీ బోర్డులో విభాగాలను ఏర్పాటుచేసి వాటి ద్వారా ఏటా పదవతరగతి పరీక్షలను, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ పరీక్షలనుజరుపుతున్నారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ పరిధిలోఎస్సెస్సీ బోర్డు పని చేస్తోంది. ఏటా బడ్జెట్ లో ఈ బోర్డుకుప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. పరీక్షల నిర్వహణ వ్యవ హారంతో పాటు పాఠశాలల్లో నిర్వహించే త్రైమాసిక, అర్ధ సంవత్సరం, ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహణ బాధ్యతలను ఎస్సెస్సీబోర్డు చేపడుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో 30 ఏళ్ళ క్రితంఏర్పాటైన ఎస్సెస్సీ బోర్డు నూతన విద్యా విధానంలో భాగంకనుమరుగు కానుంది. ఈ బోర్డుకు ప్రతి జిల్లాలో కార్య లయాలున్నాయి. జిల్లా విద్యాశాఖ అధికారి పరిధిలో పనిచేసే ఎస్సెస్సీ బోర్డు కార్యాలయాల నుంచి విద్యార్థుల సమా చారాన్ని తెప్పించుకుని వారికి ఏటా పరీక్షలను నిర్వహిస్తూ వస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏకంగా పదో తరగతిపరీక్షలకు పది లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరయ్యేవారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణాలో పరీక్షలు రాసే విద్యార్థుల సంఖ్య బాగా తగ్గింది. ఎక్కువగా రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల్లోనే ఈ పరీక్షలకు విద్యార్థులు రఖాస్తు చేసుకుంటారు. మిగతా 30 జిల్లాల నుంచివిద్యార్థుల సంఖ్య గణనీయంగా ఉన్నప్పటికీ కొన్ని జిల్లాల్లోమాత్రం సంఖ్య చాలాతక్కువగాఉంది.ఎస్సెస్సీబోర్డుఇంటర్మీడియట్ బోర్డుల విలీనం జరిగితే ఈ బోర్డుపర్యవేక్షించే బాధ్యతను ఎవరికి అప్పగిస్తారన్న అంశంపైస్పష్టత రావాల్సి ఉంది. ఉన్నత విద్యా శాఖ పరిధిలోఉంటుందా? లేకపాఠశాలవిద్యాశాఖఈబోర్డువ్యవహారాలను చూసుకుంటుందా అన్నది తేలాల్సి ఉంది

ఇంటర్ బోర్డు కనుమరుగు

దేశంలో పేరు ప్రఖ్యాతులు సాధించిన ఇంటర్ బోర్డుకనుమరుగవుతోంది. నూతన విద్యా విధానంలో భాగంగా9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు సెకండరీ విద్యాపరిధిలోకి తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. ఇక నుంచి ఇంటర్‌ను ఇంటర్ అని పిలవకుండా పదవ తరగతి తర్వాత నిర్వహించే ప్రవేశాలకు 11వ తరగతిగా, ఆ తర గతిలో ఉత్తీర్ణత సాధించే వారిని 12వ తరగతిగా పిలవాల్సిఉంటుంది. ఇంటర్ బోర్డు ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖ పరి ఢి లో ఉంది. విద్యాశాఖ మంత్రి బోర్డు చైర్మన్ గా వ్యవహరి స్తుండగా ఆ శాఖ కార్యదర్శి లేదా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
హోదాలో ఉండే అధికారి వైస్ చైర్మన్‌గా నియమి తు వు తారు. బోర్డు ఆవిర్భావం నుంచి విధానం అమల్లో ఉంది నూతన విద్యా విధానంలో భాగంగా ఎస్సెస్సీ, ఇంటర్బో ర్డును విలీనం చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఇక నుంచి రాష్ట్రంలో ఇంటర్ బోర్డు ఉండకపోవచ్చన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ రెండు బోర్డులను విలీనం చేసి ఏం పేరు పెడతారన్న అంశంపై సస్పెన్స్ కొనసా గుతోంది. ఏటా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు వార్షిక పరీక్షలు, సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించి ఫలితాలను ప్రకటించడం ఇంటర్ బోర్డు విధి. పరీక్షా కేంద్రాల ఏర్పాటు, హాల్ టికెట్ల పంపిణీ, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు, ఇంటర్ పాఠ్యపుస్తకాల
రూపకల్పన, సిలబస్ కూరు తదితర అంశాలను ఇంటర్బో ర్డు పర్యవేక్షిస్తుంది. బోర్డులో ప్రత్యేకంగా పరీక్షల విభా గం, అకడమిక్ విభాగం, ఒకేషనల్ విభాగంతో పాటు కంప్యూటర్, ఇతర విభాగాలు పని చేస్తున్నారు
 ఇంటర్ బోర్డులోనూ దాదాపు 200 మంది అధికారులు, సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా ఎక్కువ
మంది డిప్యుటేషన్పై జూనియర్ కళాశాలల నుంచి వచ్చి ఇక్కడ పనులను చక్క బెడుతున్నారు. ఇంటర్ బోర్డు కార్యదర్శిగా ఐఏఎస్ అధికారిని ప్రభుత్వం నియమిస్తూవస్తున్న సంగతి తెలిసిందే. పరీక్షల విభాగానికి ప్రత్యేకంగా ఓ సీనియర్ అధ్యాపకుడు పరీక్షల నియంత్రణాధి కారి
(కంట్రోల్)నియమిస్తారు. ఒకేషనల్, అకడమిక్ తదితర విభాగాలకు డిప్యూటీ డైరెక్టర్, డిప్యూటి సెక్రెటరీ అధికారులు పని చేస్తున్నారు ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కళాశాల ఏర్పాటుకు
అనుమతులను మంజూరు చేయడం, ఏటా కళాశాలలను తనిఖీ చేసి అనుబంధ గుర్తింపును ఇవ్వడం ఇంటర్ బోర్డు విధి. బోర్డుకు అనుబంధంగా ప్రతి జిల్లాలో డీఐవో కార్యయాలున్నాయి. జిల్లాలో జూనియర్ కళాశాలలో ఆకస్మిక తనిఖీలు, విద్యార్థులకు మౌలిక సదుపాయలు కల్పిస్తు
న్నారా? లేదా అన్నది పర్యవేక్షిస్తారు. పరీక్షల సమయంలోకళాశాలల నుంచి విద్యార్థుల సమాచారం తెప్పించుకుని బోర్డుకు చేరవేస్తారు. ఎస్సెస్సీ, ఇంటర్ బోర్డులు విలీనమైతే పరిస్థితులను పర్యవేక్షించేందుకు ఎవరిని నియమిస్తారోనని అధ్యాపకులు సమాలోచనలు జరుపుతున్నారు
Flash...   AP TEACHERS TRANSFERS 2022 SCHEDULE RELEASED