భారత్‌లో ఒకేరోజు 28వేల మంది రికవరీ!

రికవరీ రేటు 63.13శాతం
2.41శాతానికి తగ్గిన మరణాల రేటు
దిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ నిత్యం
కోలుకుంటున్న వారిసంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24గంటల్లోనే
దేశవ్యాప్తంగా 28,472 మంది కోలుకొని డిశ్చార్జి అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ
వెల్లడించింది. ఒకేరోజు ఈ స్థాయిలో కరోనా బాధితులు కోలుకోవడం ఇదే తొలిసారి.
ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 63.13శాతానికి పెరగగా, మరణాల రేటు
2.41శాతానికి పడిపోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో సమర్థవంతమైన ఆరోగ్య
నిర్వహణ కారణంగా రికవరీ రేటు పెంచడంతోపాటు మరణాల సంఖ్యను తగ్గించగలుగుతున్నట్లు
కేంద్రం తెలిపింది.
ఇప్పటికే దేశవ్యాప్తంగా 7,53,049 మంది కరోనా రోగులు వైరస్‌ నుంచి కోలుకోగా మరో
4,11,133 కేసులు మాత్రమే క్రియాశీలంగా ఉన్నాయి. దేశంలో దాదాపు 19 రాష్ట్రాలు,
కేంద్రపాలిత ప్రాంతాల్లో జాతీయ సగటు కన్నా ఎక్కువ రికవరీ రేటు నమోదవుతున్నాయి.
జూన్‌ 17న గరిష్ఠంగా మరణాల రేటు 3.36గా ఉండగా అది ప్రస్తుతం 2.41కు తగ్గిందని
ప్రభుత్వం వెల్లడించింది
. ఇంటింటి సర్వే ద్వారా ముందుగానే కేసులను గుర్తించడం,
కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంచడం, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, కంటైన్మెంట్‌
జోన్లను ఏర్పాటు చేయడం వంటి చర్యల ద్వారా వైరస్‌ వ్యాప్తిని కట్టడి
చేయగలుగుతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా బాధితుల రికవరీ రేటు
జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు..
రాష్ట్రం రికవరీ రేటు(శాతంలో)

దిల్లీ 84.83
తెలంగాణ 78.37
రాజస్థాన్‌ 72.50
గుజరాత్‌ 72.30
ఛత్తీస్‌గఢ్‌ 71.81
అసోం 71.05
ఒడిశా 70.96
తమిళనాడు 70.12
మధ్యప్రదేశ్‌ 67.47
బిహార్‌ 63.95
Flash...   Special FDs: స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్లతో ఎక్కువ రాబడి.. ఈ నెలాఖరు వరకే అవకాశం