RGV Power Star Trailer Leaked

RGV Power Star Trailer Leaked: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘పవర్‌స్టార్‌’ అనే టైటిల్‌తో సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్‌కు రూ. 25 ఖర్చు చేయాలని వర్మ ట్విట్టర్ వేదికగా తెలపగా.. ఇప్పుడు ఆ ఖర్చు లేకుండానే యూట్యూబ్‌లో ‘పవర్‌స్టార్‌’ ట్రైలర్ లీకైంది. నాలుగు నిమిషాలు నిడివి కలిగిన ఈ ట్రైలర్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.
దీనిపై అర్జీవీ స్పందించారు. ”ప‌వ‌ర్‌స్టార్ ట్రైల‌ర్ లీక్ కావ‌డం వ‌ల్ల గంటలో అఫీషియల్ వెర్షన్‌ను యూట్యూబ్‌లో విడుద‌ల చేస్తామన్నారు. అంతేకాకుండా ట్రైల‌ర్‌కి డ‌బ్బులు క‌ట్టిన వారికి తిరిగి చెల్లిస్తామ‌ని తెలిపారు”. ఈ మూవీ జూలై 25న విడుదల కానుంది. కాగా, న్యాయపరమైన చిక్కుల నుంచి తప్పించుకునేందుకు ఈ సినిమా పవర్‌స్టార్‌ పవన్ కళ్యాణ్ గురించి కాదని అర్జీవీ వెల్లడించినప్పటికీ.. పవన్ ఫ్యాన్స్ మాత్రం తమ హీరోను టార్గెట్ చేస్తూ తెరకెక్కించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
Flash...   PRC EFFECT: అన్ని ఉద్యోగ సంఘాలు సమ్మె బాటలోనే .. సమ్మె సైరన్ మోగింది