Modi సర్కార్ బిగ్ ప్లాన్.. ఇక 5 బ్యాంకులే

దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య సింగిల్ డిజిట్‌కు తగ్గిపోనుంది. మోదీ
సర్కార్ బిగ్ ప్లాన్‌తో ముందకు వెళ్తోంది. దీంతో భవిష్యత్‌లో కేవలం 5
ప్రభుత్వ రంగ బ్యాంకులే మిగలనున్నాయి.

బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్
5కు తగ్గనున్న ప్రభుత్వ బ్యాంకుల సంఖ్య
కేంద్రం వడివడిగా అడుగులు.
కేంద్ర ప్రభుత్వం గతంలోనే బ్యాంకుల విలీన ప్రక్రియకు తెరతీసింది. అయితే ఇది ఇంకా
అయిపోలేదు. మోదీ సర్కార్ మరిన్ని ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరించాలని
యోచిస్తోంది. ఈసారి బ్యాంకులను విలీనం చేయకుండా.. సగానికి పైగా ప్రభుత్వ
బ్యాంకుల్లో వాటాలను విక్రయించాలని భావిస్తోంది.
అంతా అనుకున్నట్లుగానే జరిగితే.. దేశంలో కేవలం 5 ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రమే
మిగులుతాయి. కేంద్ర ప్రభుత్వం సహా బ్యాంకింగ్ రంగానికి చెందిన విశ్వసనీయ వర్గాల
ప్రకారం.. బ్యాంకింగ్ వ్యవస్థను మెరుగు పరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు
నిర్ణయం తీసుకోబోంది.
ప్రభుత్వం తొలిగా బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్
ఓవర్సీ్స్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర, పంజాబ్ అండ్ సింద్
బ్యాంక్ వంటి వాటిల్లో ప్రభుత్వం తన వాటాలను విక్రయించనుంది.
సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం దేశంలో కేవలం 4
నుంచి 5 ప్రభుత్వ బ్యాంకులు మాత్రమే ఉండాలని యోచిస్తోందని తెలిపారు. ప్రస్తుతం
దేశంలో 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి. మోదీ సర్కార్ ఈ ఏడాది 10 ప్రభుత్వ
బ్యాంకులను విలీనం చేసి 4 బ్యాంకులుగా మార్చింది. దీంతో 2020 ఏప్రిల్ 1 నుంచి
దేశంలో 12 బ్యాంకులు మాత్రమే ఉన్నాయి. 2017లో ప్రభుత్వ బ్యాంకులు 27 ఉండేవి.
మోదీ సర్కార్ ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ అంశంపై పనిచేస్తోందని, త్వరలోనే ఈ
అంశం కేబినెట్ ముందకు రాబోతుందని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. రిజర్వు
బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా 5 కన్నా ఎక్కువ బ్యాంకులు అవసరం లేదని సూచించింది.
Flash...   WhatsApp: అలర్ట్... ఈ తప్పు చేస్తే మీ వాట్సప్ బ్లాక్ కావడం ఖాయం