కొత్త జిల్లాలు – బదిలీలపై ప్రభావం – ప్రస్తుత బదిలీలపై స్థానికత భయం

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా
మార్చాలని అభిప్రాయంలో ఉంది. దీనికోసం ఇప్పటికే ఒక కమిటీని నియమించాలని మంత్రి
మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుతం ప్రతి జిల్లా పార్లమెంటు ప్రాతిపదికగా కాకుండా పూర్వం లో ఉన్న
వెసులుబాటును బట్టి, భౌగోళిక పరిస్థితులను బట్టి, రాజకీయ పరిస్థితులను బట్టి
జిల్లాలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు వీటి స్వరూపం మారిపోతుంది.
దీనివలన జిల్లా యూనిట్ గా జిల్లాలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగస్తుల పై ప్రభావం
ఉంటుంది. ప్రస్తుతం ఎవరికి వారు వారి వెసులుబాటును బట్టి జిల్లాలోని వివిధ
ప్రాంతాల్లో పని చేస్తున్నారు. అంతేకాకుండా వారు నివాసం ఉంటున్న ప్రాంతానికి
దగ్గరలో కాకుండా జిల్లాలోని దూర ప్రాంతాల్లో పనిచేస్తున్నారు.
ప్రస్తుతం జరపబోయే బదిలీలు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా నిర్వహించడానికి సన్నాహాలు
చేస్తున్నందున తప్పనిసరి బదిలీ పొందేవారు జిల్లాలోని ఏదో ఒక ప్రాంతానికి బదిలీ
అవుతారు. ఇలా కేటాయించే పాఠశాల ప్రస్తుత జిల్లా యూనిట్ గా జరుగుతుంది.
ఇప్పుడు బదిలీ పొందేవారు భవిష్యత్తులో ప్రకటించే టటువంటి నూతన జిల్లాల ప్రకటన
ద్వారా ప్రస్తుతం ఉంటున్న జిల్లా నుంచి వేరొక జిల్లాగా మారిపోయే అవకాశం
ఉంటుంది. కానీ నివాస ప్రాంతం మరొక జిల్లాలో ఉంటుంది. దీనివలన తమ నివాస ప్రాంతం
కాకుండా వేరొక జిల్లాలో పని చేయాల్సి వస్తుంది.
కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేసిన తరువాత ఉద్యోగులకు తన సొంత జిల్లాలకు
వెళ్ళడానికి ప్రభుత్వం ఆప్షన్ ఇస్తుంది. ఇది కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన
తర్వాత జరుగుతుంది. దీనిపై ఉద్యోగ వర్గంలో చాలా సందేహాలు ఉన్నాయి.
తెలంగాణలో అనుసరించిన విధానం
మన పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలను చాలా కాలం క్రితం ఏర్పాటు
చేశారు.
దీనిపై అక్కడ ఉన్న ఉపాధ్యాయ మిత్రులకు సమాచారం కోసం సంప్రదించగా కొత్త జిల్లాల
ఏర్పాటు తర్వాత ఏ జిల్లా కావాలో ఎంచుకునే అవకాశం ఇచ్చినప్పటికీ అది అది
కార్యరూపం దాల్చలేదని తెలియజేశారు. ఇప్పటికీ తమ నివాస ప్రాంతం తాము
పనిచేస్తున్న ప్రాంతం మరొక జిల్లా అని తెలిపారు.
Flash...   AP TET Hall Ticket 2022 Download
అత్యవసర సమయాల్లో పాత జిల్లా కేంద్రంగానే బదిలీలు ప్రమోషన్లు ఇతర సర్వీస్
వ్యవహారాలు జరుగుతున్నట్లుగా తెలిపారు.
అక్కడ జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేసి చాలా కాలం అయినప్పటికీ ఇంకా అధికారిక
కేంద్ర కార్యకలాపాల్లో మార్పులు చోటు చేసుకోలేదని తెలిపారు.
ముగింపు
ఇప్పుడు బదిలీ పొంది అనువైన పాఠశాల పొందినప్పటికీ జిల్లాల పునర్వ్యవస్థీకరణ
వల్ల మళ్లీ స్థానచలనం తప్పదేమో అన్న భావన వ్యక్తమవుతోంది.

ఉద్యోగుల్లో ఉత్కంఠ
ప్రస్తుత బదిలీలపై స్థానికత భయం
జిల్లాల పునర్విభజనపై సర్వత్రా చర్చ.
ఉదాహరణకు   కృష్ణ జిల్లా 
కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించిన నేపథ్యంలో
జిల్లాలో ఓ వైపు రాజకీయ వేడి రాజుకోగా, మరో పక్క ఉద్యోగుల్లో ఉత్కంఠ నెలకొంది.
లోక్‌సభ నియోజకవర్గ స్థానాలు ప్రాతిపదికన జిల్లాలు ఏర్పాటు చేయనున్నారు. జిల్లా
రెండుగా విడిపోతుండగా, కైకలూరు, నూజివీడు నియోజకవర్గాలు ఏలూరు జిల్లాలోకి
వెళ్లనున్నాయి. ఆయా ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు
సీనియారిటీ, స్థానికత తదితర అంశాలపై చర్చించుకుంటున్నాయి. 
జిల్లా వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయులు 47,512 మంది వివిధ శాఖల్లో, వివిధ
యాజమాన్యాల్లº పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఉపాధ్యాయుల బదిలీలకు ప్రభుత్వం
పచ్చజెండా ఊపటంతో నూతన ప్రదేశాలను కోరుకునే వారిలో పునర్విభజన టెన్షన్‌
పట్టుకుంది. ఉద్యోగులను నూతన జిల్లాకు బదలాయించడం వల్ల సర్వీసు సంబంధమైన సమస్యలు
వచ్చే అవకాశముందని, ప్రారంభ అవరోధాలను అధిగమిస్తే మాత్రం సత్ఫలితాలు వస్తాయని
నిపుణులు తెలుపుతున్నారు. తెలంగాణలో జిల్లాల పునర్విభజనతో ఆరంభంలో కష్టాలు
ఎదురైనా ప్రస్తుతం తొలగిపోయాయని నాయకులు పేర్కొంటున్నారు. ఏలూరు పార్లమెంట్‌
స్థానం పరిధిలో ఉన్న కైకలూరు, నూజివీడు నియోజకవర్గాలు కొత్త జిల్లాలోకి
వెళ్లనున్నాయి. స్థానికంగా ఉండే నాయకులు నూజివీడును విజయవాడ జిల్లాలో, కైకలూరును
మచిలీపట్నంలో కలపాలని, లేకుంటే గుడివాడ జిల్లా చేసి అందులో ఉంచాలని కోరుతున్నారు.
పునర్విభజనలో పక్క జిల్లాకు కేటాయించటం వల్ల సర్వీసు ర్యాంకులు, పదోన్నతుల్లో
కొంత మందికి అన్యాయం జరుగుతుందని పేర్కొంటున్నారు. వేరే జిల్లాకు వెళ్లవలసి
వచ్చినపుడు అక్కడ సీనియారిటీ ఎలా అన్నదానిపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం
చేస్తున్నారు.
Flash...   News Headlines 3.7.20
స్థానికత సమస్య..:
పుట్టిన ప్రదేశం లేదా వరుసగా ఏడేళ్లు చదువుకున్న ప్రాంతాన్ని బట్టి ఇప్పటి వరకు
స్థానికతను పరిగణిస్తున్నారు. ప్రస్తుతం అనేక మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు వేరే
ప్రాంతాలకు వలస వెళ్లి అక్కడే స్థిరపడిపోయారు. జిల్లాల విభజన వల్ల తిరిగి తమ
ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం జరగనున్న
ఉపాధ్యాయ బదిలీల్లో దీని ప్రభావం ఎక్కువగానే ఉంటుందనే భావన వ్యక్తమవుతోంది.
ఉమ్మడి సీనియారిటీ రూపొందించాలి
ఉద్యోగులకు జిల్లా ఉమ్మడి సీనియారిటీ ప్రకారమే ఏ జిల్లాకు కేటాయించినా పదోన్నతులు
కల్పించాలి. జిల్లాలో ఉద్యోగులందరినీ కొత్తగా ఏర్పడే మూడు జిల్లాల్లో వారికి
ఇష్టమైన ఐచ్ఛికాన్ని ఎంచుకొనేలా అవకాశమివ్వాలి.
జి.మాధవరావు, పంచాయతీరాజ్‌ ఉద్యోగి