2 వారాల్లో కరోనా డ్రగ్స్ ఫలితాల్ని పరిశీలించబోతున్న WHO

Corona Drug : కరోనా వైరస్‌ని కంట్రోల్ చెయ్యడం టాబ్లెట్ల వంటి మందులతో సాధ్యం కాదనీ… దానికి వ్యాక్సినే సరైన మందు అని చాలా మంది శాస్త్రవేత్తలు చెబుతూ వచ్చారు. ఐతే… టాబ్లెట్లతో ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకునేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రత్యేక ట్రయల్స్ చేయించింది. ఆ మందు బిళ్లలతో ట్రయల్స్‌లో ఎలాంటి ఫలితాలు వస్తున్నాయో రెండు వారాల్లో పరిశీలించబోతోంది. మొత్తం 39 దేశాల్లో 5500 మంది కరోనా పేషెంట్లపై ఈ ప్రయోగాలు జరిగాయి. రెండు వారాల్లో వచ్చేవి మధ్యంతర ఫలితాలు మాత్రమే. పూర్తిస్థాయి ఫలితాల రిపోర్ట్ రావడానికి కొంత టైమ్ పడుతుంది.
మలేరియా వ్యాధి నివారణకు వాడే… హైడ్రాక్సీ క్లోరోక్విన్, స్టాండర్డ్ కేర్, రెమ్‌డెసివిర్ (Remdesivir), లోపనివిర్ లేదా రైటోనావిర్ కాంబినేషన్ మందులతో కరోనా కంట్రోల్ అవుతుందా అనే విషయం తెలుసుకునేందుకు WHO ఈ ప్రయోగాలు చేయించింది. మొత్తం ఐదు భాగాలుగా వీటిని జరిపించింది. ఐతే… ఈ నెల మొదట్లో… హైడ్రాక్సీ క్లోరోక్విన్‌తో ట్రయల్స్‌ను WHO నిలిపేసింది. ఎందుకంటే… ఆ మందు కరోనా మరణాల్ని ఆపలేకపోతోంది. ఐతే… హైడ్రాక్సీ క్లోరోక్విన్‌లో ఏవైనా మార్పులు చేస్తే… అది కరోనాని ఆపే ఛాన్స్ ఉందా అనే అంశంపై ప్రయోగాలు జరగాల్సి ఉందని WHO తెలిపింది.
ఈ డ్రగ్స్‌లో ఏదైనా బలంగా పనిచేస్తుందని WHO భావిస్తే… ఆ డ్రగ్‌ను ప్రపంచమంతా వాడమని సూచించే అవకాశాలు ఉంటాయి. ఐతే… మందుల కంటే వ్యాక్సిన్ వల్లే కరోనా అంతమవుతుందని పరిశోధకులు భావిస్తున్నారు.
ఏడాది చివరి నాటికి కరోనాకి వ్యాక్సిన్ తయారవుతుంది అని అనుకోవడం తెలివితక్కువతనమే అవుతుందని WHO ఏజెన్సీస్ ప్రోగ్రామ్ హెడ్ మైక్ ర్యాన్ చేసిన కామెంట్ అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆ కామెంట్ చేయడానికి బలమైన కారణం ఉంది. ఈ సంవత్సరం చివరి నాటికి కరోనా వ్యాక్సిన్ రాగలిగినా… దాన్ని భారీ ఎత్తున వెంటనే ఎలా ఉత్పత్తి చెయ్యగలరని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతానికి కరోనాకి కరెక్టైన వ్యాక్సిన్ ఇంకా లేదంటూనే… 18 వ్యాక్సిన్లను మాత్రం మనుషులపై ప్రయోగిస్తున్నారని మైక్ ర్యాన్ తెలిపారు.
ప్రపంచ దేశాలు లాక్‍‌డౌన్లను ఎత్తివేస్తూ… కరోనాను తేలిగ్గా తీసుకుంటున్నారన్న మైక్ ర్యాన్… ఎక్కడైతే గుంపులుగా కేసులు నమోదవుతాయో… అలాంటి క్లస్టర్లను గుర్తించాలని కోరారు. అలాగే… కరోనా సోకిన వారిని వెంటనే ఐసోలేట్ చేసి… కరోనా చైన్ కట్ అయ్యేలా చెయ్యాలన్నారు.
Flash...   COVID-19 CASES REDUCED IN AP TODAY (25.05.2020)