కరోనా సోకినా ఇంట్లోనే ఉండొచ్చు.. జగన్ సర్కార్ సంచలన నిర్ణయం.. మార్గదర్శకాలివే..

ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా 1,000 పడకల కోవిడ్ కేర్ సెంటర్ల (సీసీసీ)ను ప్రభుత్వం
కేటాయించిందని (ఈ పడకలు 2-3 కేంద్రాలలో ఉండవచ్చు) కోవిడ్ కమాండ్ సెంటర్ ప్రత్యేక
అధికారి ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. ఒక్కో కేంద్రాన్ని నోవెల్ సీసీసీ
(ట్రియేజ్ సెంటర్)గా నియమించినట్లు పేర్కొన్నారు. ఈ నోవెల్ సీసీసీలో ఈసీజీ,
ఎక్స్‌రే, ల్యాబ్ టెస్ట్‌లు వంటి అన్ని డయాగ్నొస్టిక్ సదుపాయాలు లభిస్తాయని,
ఎవరికైనా కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయితే నోవెల్ సీసీసీకి మార్చి, అక్కడ పరీక్షలు
నిర్వహిస్తారని పేర్కొన్నారు.
అయితే తేలికపాటి లక్షణాలు కలిగి సీసీసీకి వెళ్లకూడదని అనుకొంటే, ఇంట్లోనే హోమ్
ఐసోలేషన్ (10- 60 సంవత్సరాల మధ్య వయసు వారు) ఉండొచ్చని ప్రభాకర్ రెడ్డి
వెల్లడించారు. దీనికి సీసీసీ ఇన్‌చార్జి స్వయంగా ఇంటి ఐసోలేషన్‌కు అనుమతిస్తారని
తెలిపారు. అయితే మధ్యమ, తీవ్ర లక్షణాలు, డయాబెటిస్, రక్త పోటు, సీఓపీడీ వంటి
జబ్బులు ఉన్నవారిని మాత్రం కోవిడ్ ఆస్పత్రికి తరలిస్తామని వెల్లడించారు. ఇంట్లో
ఉన్న ఐసోలేషన్ రోగుల పల్స్, బీపీ, ఎస్పీఓ 2 (ఆక్సిజన్ శాతం), బ్లడ్ షుగర్ కోసం
తమను తాము పరీక్షలు చేసుకొని పర్యవేక్షించుకోవాలని ప్రభాకర్ రెడ్డి సూచించారు. ఆ
ప్రాంతానికి చెందిన కోవిడ్ సెంటర్, ఏఎన్ఎం ద్వారా అతడికి శిక్షణ ఇవ్వనున్నట్లు
వెల్లడించారు.
ఇంట్లో ఉన్న ఐసోలేషన్ రోగులను పర్యవేక్షించడానికి ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసిన
టెలీ కన్సల్టేషన్ కేంద్రాలు పనిచేస్తాయని ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. వారు
కరోనా బాధితులను జాగ్రత్తగా చూసుకుంటారని.. న్యూట్రిషన్, సైకలాజికల్ సపోర్ట్ కోసం
మార్గదర్శకత్వం కూడా ఇస్తారన్నారు. ఇంట్లో ఐసోలేషన్ ఉన్న రోగికి కష్టం కలిగితే,
అతడిని మరింత మెరుగైన చికిత్స కోసం కోవిడ్ ఆస్పత్రులకు తరలిస్తారమన్నారు. ఇంటి
ఐసోలేషన్ 28 రోజుల్లో పూర్తి చేసిన తర్వాత మీరు కోవిడ్ పరీక్ష నిర్వహిస్తారని,
దీని కోసం ఏఎన్ఎం సహాయం చేస్తుందన్నారు. ఇంటి ఐసోలేషన్ పూర్తయినట్లు ప్రకటించిన
తర్వాత స్వీయ గృహ నిర్భంధం నుంచి విముక్తి పొందుతారని.. ప్రభుత్వం కల్పించిన
స్వీయ గృహ నిర్బంధం సదుపాయాన్ని ఉపయోగించువాలన్నారు. కోవిడ్ పాజిటివ్ అయినప్పటికీ
మీ ఇంట్లోనే సురక్షితంగా ఉండండని ప్రభాకర్ రెడ్డి పిలపునిచ్చారు.
Flash...   తనిఖీలు మొదలయ్యాయి: పాఠశాలలను తనిఖీ చేస్తున్న నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్