ONLINE కిరాణా సరుకులు ఆర్డర్ చేసిన టీచర్‌కు లక్ష టోకరా!

కరోనా వైరస్ సంక్షోభంతో కిరాణా షాపులకు వెళ్లి సరుకులు తెచ్చుకోలేని పరిస్థితి.
ఆన్‌లైన్ లోనే ఆర్డర్ ఇచ్చి ఇంటికి తెప్పించుకుంటున్నారు. ఇదే క్రమంలో ముంబైలోని
ఓ టీచర్  రూ.2వేల కంటే తక్కువ ధర ఉన్న ఆర్డర్ ఇవ్వగా ఆమె సైబర్ క్రిమినల్
ట్రాప్ లో పడి లక్షా 2వేల రూపాయలు దోచుకున్నాడు. దీంతో 33 సంవత్సరాల మహిళపై ముంబై
పోలీసులు కేస్ ఫైల్ చేశారు. 

నిజానికి మహిళ ఆన్ లైన్ లో ఆర్డర్ ఇచ్చి తర్వాత క్యాన్సిల్ చేసేశారు. సైబర్
క్రిమినల్ ఆమెను మిర్రరింగ్ అప్లికేషన్ ఇన్ స్టాల్ చేసుకోమన్నాడు. దాంతో డబ్బులు
దోచేసుకున్నాడు. వోర్లీలో ఉండే సీమా సేత్ అనే బీఎంసీ టీచర్ ఫిర్యాదులో ఇలా
పేర్కొంది. మే 24న రూ.వెయ్యి 716ల గ్రోసరీ ఆర్డర్ బుక్ చేసింది. 
 కొద్ది గంటల తర్వాత దానిని క్యాన్సిల్ చేసింది. తనకు రీఫండ్ కావాలని మొబైల్
అప్లికేషన్ లో అప్లై చేసింది. డబ్బులు కచ్చితంగా రీఫండ్ అవుతాయని గ్రోసరీ కంపెనీ
తెలిపింది. చాలా రోజులు అయిపోయినప్పటికీ సేత్ కు డబ్బులు రాలేదు. జూన్ 3న గ్రోసరీ
కస్టమర్ కేర్ నెంబర్ కు ఇంటర్నెట్ నుంచి కాల్ చేసింది. సైక్లోన్ నిసర్గ్ కు
విరాళం ఇచ్చే క్రమంలో ఆలస్యం అయిందని తెలిపారు. తాను కొన్ని లింకులు పంపుతానని
అవి ఇన్ స్టాల్ చేసుకోవాలని ఫోన్ లో అన్నారు. 

కాలర్ చెప్పినవన్నీ చేసేసరికి ఆమె అకౌంట్ నుంచి రూ.లక్ష 2వేలు పోయాయి. బాధితురాలు
వెంటనే ఎగ్జిక్యూటివ్ కు కాల్ చేసింది. బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు పోయాయని
కంప్లైంట్ ఇవ్వడంతో రూ.23వేలు తిరిగొచ్చాయి. పలు సెక్షన్ల ప్రకారం కేసు నమోదు
చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Flash...   Traffic Challan: మీ వాహనంపై ట్రాఫిక్ చలాన ఉందా? ఇలా పేటీఎం ద్వారా కూడా చెల్లించవచ్చు