రేపటి నుండి తెలుగు TV సీరియల్స్ ప్రారంభం

కరోనా లాక్ డౌన్ తో రెండు నెలలుగా తెలుగు సీరియల్ షూటింగ్ లు నిలిచిపోయాయి. దాంతో
ఛానల్స్ లో పాత ఎపిసోడ్ లనే రిపీట్ చేసారు. కాగా ప్రస్తుతం లాక్ డౌన్ లో చేసిన
సడలింపులతో సీరియల్ షూటింగ్ లు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ నిబంధనలు
పాటిస్తూ దర్శకులు చిత్రీకరణను ప్రారంభించారు. అయితే ఇన్ని రోజులు పాత ఎపిసోడ్లు,
సెలబ్రెటీలు ఇంట్లో ఉండి చేసిన కొన్ని వినోద కార్యక్రమాలను ప్రచారం చేసారు. ఇక
షూటింగ్ లు ప్రారంభించటంతో రేపటి నుండి కొత్త ఎపిసోడ్లు, రియాలిటీ షోలు ప్రసారం
కానున్నాయి. 
ఈ నేపథ్యంలో దాదాపు అన్ని ప్రముఖ ఛానళ్లు రేపటి నుండి కొత్త ఎపిసోడ్లను, రియాలిటీ
షో లను ప్రసారం చేస్తునట్టు వెల్లడించాయి. కరోనా విజృంభణ కారణంగా ఇప్పట్లో
థియేటర్లు తెరుచుకునే పరిస్థితులు కనిపించట్లేదు. కాబట్టి ప్రేక్షకులకు ఇది
కొంతవరకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. 
Flash...   అన్‌లాక్‌ 3.0: సినిమా థియేటర్లకి అనుమతి..