DSC-18 అర్హత అభ్యర్థులకు నియామకాలు.

ఏలూరు విద్యావిభాగం, న్యూస్టుడే: డీఎస్సీ-2018 సెలక్షన్ జాబితాలోని అభ్యర్థులకు
నియామకాల ప్రక్రియను నిర్వహించారు. స్కూల్ అసిస్టెంట్ హిందీ, భాషా పండిత
అభ్యర్థులకు స్థానిక ఎస్ఎస్ఏ జిల్లా ప్రాజెక్టు కార్యాల యంలో సోమవారం సాయంత్రం
కౌన్సెలింగ్ నిర్వహించి నియామక పత్రాలను అందజేశారు. 

డీఈవో సీవీ రేణుక సమక్షంలో కౌన్సెలింగ్ ప్రక్రియ సాగింది. జడ్పి పాఠశాలల్లో
స్కూల్ అసిస్టెంట్ హిందీ 17, LP 6 కొలువులు, పురపా లక పాఠశాలల్లో LP 2, ఏజెన్సీ
ప్రాంత పాఠశాలల్లో LP 2 కొలువులను కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేశారు. పుర పాలక
పాఠశాలకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్ హిందీ అభ్యర్థి ఒకరు కౌన్సెలింగ్ కు హాజరు
కాలేదు. మొత్తం 27మంది అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు.

Flash...   AP Govt Employees: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. బదిలీలకు గ్రీన్ సిగ్నల్