కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు విధులకు హాజరు కావటంపై తాజాగా
మార్గదర్శకాలు విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.. హైదరాబాద్ సహా
ఇతర రాష్ట్రాలకు ఉద్యోగులు ఎవరూ వెళ్లోద్దని ఆదేశాల్లో స్పష్టం చేసింది.
కంటైన్మెంటు జోన్లలో నివాసముండే అధికారులు, సిబ్బంది డీనోటిఫై చేసేంత వరకూ ఇంటి
నుంచే విధులు నిర్వహించాలని స్పష్టం చేసింది.
కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రతీ ప్రభుత్వ ఉద్యోగీ వ్యక్తిగతంగా జాగ్రత్తలు
తీసుకోవాల్సిందేనని సూచించిన సర్కార్… మధుమేహం, హృద్రోగం, ఊపిరితిత్తుల
వ్యాధులు, కిడ్నీ సమస్యలు కలిగిన ఉద్యోగులు వైద్య ధృవీకరణ పత్రం సమర్పిస్తేనే
ఇంటి నుంచి విధులు నిర్వహణకు అనుమతిస్తామని స్పష్టం చేసింది. కాగా.. ఏపీ సచివాలయం
సహా పలు కార్యాలయాల్లో కరోనా కేసులు వెలుగు చూసిన సంగతి తెలిసిందే.. దీంతో
అప్రమత్తమైన సర్కార్.. కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.