క‌రోనా అల‌ర్ట్ః వైర‌స్ పరీక్షల్లో మరో రెండు లక్షణాలు

SEMLLING
క‌రోనా టెస్టుల కోసం ప్ర‌స్తుతం ప‌రిగ‌ణిస్తున్న 13 ల‌క్ష‌ణాల జాబితాలో మ‌రో 2
అంశాల‌ను చేర్చేందుకు కేంద్రం సిద్ధ‌మ‌వుతోంది. వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య‌
అంతకంతకూ పెరుగుతున్న వేళ లక్షణాల సంఖ్యను పెంచి, కరోనా కేసులను గుర్తించి..
నిరోధక చర్యలు చేపట్టాలని ప్ర‌భుత్వం భావిస్తోంది. వైర‌స్ సోకిన కొంద‌రిలో వాస‌న
చూసే శ‌క్తి, రుచిని గుర్తించే శ‌క్తి త‌గ్గిన‌ట్లు వైద్యులు గుర్తించారు. 
ఈ రెండు లక్షణాలను కూడా కరోనా పరీక్షలు జరిపేందుకు ఆధారంగా తీసుకునే అంశాన్ని
భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) పరిశీలిస్తోంది. కొవిడ్-19పై ఐసీఎంఆర్
ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్.. ప్రపంచవ్యాప్తంగా లభ్యమవుతున్న వైద్య గణాంకాలను
పరిగణనలోకి తీసుకొని దీనిపై అధ్యయనం చేసింది.
దేశంలో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలను చేసేందుకు ప్రస్తుతం 13 లక్షణాలను
పరిగణిస్తున్నారు. ఈ జాబితాకు రుచి, వాసన శక్తిని కోల్పోయే లక్షణాలను
చేర్చనున్నారు. రుచి, వాసన కోల్పోవడాన్ని కరోనా వైరస్ ముఖ్య లక్షణాలుగా ప్రపంచ
ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఇప్పటికే గుర్తించింది. అమెరికా, బ్రిటన్‌,
ఆస్ట్రేలియాతో పాటు పలు యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు ఈ అంశాన్ని ఏప్రిల్‌లోనే
దీన్ని గుర్తించాయి. పలు దేశాలు కొవిడ్-19 లక్షణాల్లో ఈ రెండింటినీ చేర్చి
పరీక్షలు నిర్వహిస్తున్నాయి.
Flash...   క‌రోనా టైం : గొంతు నొప్పి.. గ‌ర‌గ‌రా ఉందా.. హోం రెమిడీస్‌....