కరోనాపై తనకు తానుగా శ్వేతపత్రం విడుదలచేసిన చైనా!

కరోనా వైరస్‌తో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకూ నాలుగు లక్షల మంది ప్రాణాలు
కోల్పోగా.. 70 లక్షలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి తొలిసారి చైనా
గడ్డపై పురుడుపోసుకోగా.. వైరస్ వ్యాప్తి విషయంలో డ్రాగన్ వ్యవహారశైలి ఆది నుంచీ
అనుమానాస్పదంగానే ఉంది. చైనా వైఖరిని అమెరికాతో సహా పలు దేశాలు తప్పుపడుతూనే
ఉన్నాయి. వైరస్ గురించి ప్రపంచ దేశాలకు ముందస్తు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడమే కాదు,
కనీసం అప్రమత్తం కూడా చేయలేదని తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. అన్ని వేళ్లూ తమవైపు
చూపెడుతుంటే చైనా ఒకింత ఒత్తిడికి గురవుతోంది. వీటినుంచి బయటపడేందుకు డ్రాగన్‌
ప్రయత్నిస్తూనే ఉంది.

చైనా శ్వేతపత్రం ప్రకారం.. తొలిసారిగా డిసెంబర్‌ 27న వుహాన్‌‌లో కొత్తరకం వైరస్‌
బయటపడిన వెంటనే స్థానిక ప్రభుత్వం అప్రమత్తమైంది. రోగి ఆరోగ్య స్థితి, క్లినికల్‌
ఫలితాల విశ్లేషణ, వైరస్‌ వ్యాప్తిపై పరిశోధన, ప్రాథమిక పరీక్ష ఫలితాలపై నిపుణుల
బృందం పూర్తిగా విశ్లేషించింది. చివరకు దీన్ని వైరస్‌ న్యూమోనియాగా నిపుణుల బృందం
తేల్చినట్లు శ్వేతపత్రంలో చైనా వివరించింది. అనంతరం ఒకరి నుంచి ఇంకొకరికి
సంక్రమిస్తుందని జాతీయ ఆరోగ్య కమిషన్‌ ఏర్పాటు చేసిన అత్యున్నత నిపుణల బృందం
జనవరి 19న ధ్రువీకరించింది.
అంతేకాదు, మహమ్మారి గురించి నిపుణులను అప్రమత్తం చేసిన నెలలోపే ప్రజలకు ఈ
వైరస్‌పై ప్రకటన చేసినట్లు తెలిపింది. జనవరి 19కి ముందు మనిషి నుంచి మనిషికి
వ్యాపిస్తుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని ఎన్‌హెచ్‌సీ ఏర్పాటు చేసిన నిపుణలు
బృందంలోని వాంగ్‌ గౌంగ్‌ఫా వెల్లడించారు. ఆ సమయంలో వుహాన్‌లో నిపుణుల బృందం
పర్యటించినప్పుడు అక్కడ జ్వరంతో బాధపడుతున్న వారిసంఖ్య గణనీయంగా పెరిగినట్లు
గుర్తించామని గౌంగ్‌ఫా వివరించారు. తొలుత గబ్బిలాలు, పాంగోలిన్‌లు ఈ వైరస్‌
వ్యాప్తికి కారణమైనట్లు భావించినప్పటికీ వీటిని నిర్ధారించే ఎలాంటి ఆనవాళ్లు
లభించలేదని వాంగ్‌ అన్నారు.
ఇలా వైరస్‌ వ్యాపిస్తున్న సమయంలో.. అంటువ్యాధి అని చెప్పడానికి సరైన ధ్రువీకరణ
లేదని చైనా తన శ్వేతపత్రంలో పేర్కొంది. ఆ సమయంలో, వుహాన్‌తోపాటు హుబే
ప్రావిన్సులో కరోనా వైరస్‌ను ఎదర్కొవడంలో ఎంతో అనిశ్చితి నెలకొంది.. జనవరి 19నే
చైనా వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం(సీసీడీసీ) దీనిపై స్పష్టమైన ప్రకటన
చేసింది. ఈ సమయంలోనే వైరస్‌ కేసులు ఎక్కువ కావడంతో వెంటనే ప్రపంచ ఆరోగ్య
సంస్థతోపాటు అమెరికాకు వైరస్‌కు సంబంధించిన జన్యు క్రమంతోపాటు ఎప్పటికప్పుడు
తమవద్ద ఉన్న సమాచారాన్ని అందజేశామని చైనా ఆ శ్వేతపత్రంలో పేర్కొంది.
Flash...   COVID 19 INDIAN DASHBOARD