JAGAN REVIEW ON NADU NEDU WORKS

ప్రభుత్వ పాఠశాలల్లో నాడు – నేడు కార్యక్రమంపై సీఎం జగన్‌ ఉన్నత స్థాయి సమీక్ష
ఏయే పాఠశాలలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారనే దానిపై మ్యాపింగ్‌ చేయండి
6 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల ప్రతిభపై నిరంతరం అధ్యయనం చేయాలి
డిజిటల్‌ లెర్నింగ్‌ కోసం సమగ్రంగా యాప్‌ రూపకల్పన చేయాలి
విద్యార్థుల సందేహాల నివృత్తికి ఇందులో వీడియో కాల్‌ సదుపాయం కూడా ఉండాలి
కలెక్టర్లు, జేసీలు మధ్యాహ్న భోజనంపై నిరంతరం క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాలి
జూలై చివరి నాటికి నాడు–నేడు పనులన్నీ పూర్తి చేయాలి.. క్వాలిటీ ఉండాలి 
  
స్కూల్లో సదుపాయాలపై టోల్‌ ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేయాలి
‘నాడు – నేడు’ నా మనసుకు చాలా నచ్చిన కార్యక్రమం. దీని కింద పాఠశాలల
నిర్మాణాల్లో, పనుల్లో నాణ్యత కోసం పాటించాల్సిన పద్ధతులకు స్టాండర్డ్‌ ఆపరేషన్‌
ప్రొసీజర్‌ (ఎస్‌ఓపీ) రూపొందించాలి. దీనిని సంబంధిత విభాగాలకు పంపించాలి. గ్రామ,
వార్డు సచివాలయాల్లో ఉన్న ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌నూ భాగస్వామ్యం చేయాలి.
గవర్నమెంట్‌ అంటే నాసిరకం కాదు.. క్వాలిటీ అన్న పేరు రావాలి.
6 నుంచి 10 తరగతుల పిల్లలు నేర్చుకునే విధానం, వారు చూపిస్తున్న ప్రతిభపై నిరంతరం అధ్యయనం జరగాలి. విద్యార్థులకు వస్తున్న మార్కులు, వారు చూపిస్తున్న ప్రతిభపై సమాచారాన్ని సేకరించి అనలైజ్‌ చేయాలి. ఏయే సబ్జెక్టుల్లో వెనకబడి ఉన్నారో గుర్తించి.. నేర్చుకోవడంలో వారికున్న సమస్యలను అధిగమించడానికి ప్రత్యేక పద్ధతులు, విధానాలను రూపొందించాలి. 
విద్యార్థుల సంఖ్య ఆధారంగా, వారి అవసరాల మేరకే టీచర్లను నియమించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. విద్యార్థులు, టీచర్ల నిష్పత్తిని కచ్చితంగా పాటిస్తూ బదిలీలు ఉండాలని దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాడు–నేడు కార్యక్రమంపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. విద్యార్థులకు మంచి చేయడానికి టీచర్ల బదిలీలు దోహదం చేసేలా విధివిధానాలు రూపొందించాలని స్పష్టం చేశారు. జూలై 15 తర్వాత ఆన్‌లైన్‌ విధానంలో టీచర్ల బదిలీలు నిర్వహిస్తామని అధికారులు సీఎంకు వివరించారు. ఏ పాఠశాలలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారనే దానిపై మ్యాపింగ్‌ చేయాలని సీఎం సూచించారు. 2017లో అనుసరించిన పద్ధతుల కారణంగా 7,991 స్కూళ్లకు సింగిల్‌ టీచర్‌ను కేటాయించారని, వీటిలో చాలా వరకు మూతబడ్డాయని సమావేశంలో చర్చకు వచ్చింది. సమీక్షలో సీఎం ఆదేశాలు, అధికారులు వెల్లడించిన అంశాలు ఇలా ఉన్నాయి.
పిల్లలకు మంచి జరగాలి
► ప్రభుత్వ స్కూళ్లను ఎలా నిర్వీర్యం చేయాలి.. విద్యార్థులను ప్రైవేట్‌ పాఠశాలలకు ఎలా పంపాలి.. అనే కోణంలో అప్పుడు నిర్ణయాలు జరిగాయి. దీనివల్ల ప్రభుత్వ విద్యా రంగానికి తీవ్ర నష్టం జరిగింది.
► అక్టోబర్, నవంబర్‌ నెలలు వచ్చినా యూని ఫామ్స్, పుస్తకాలు ఇవ్వలేదు. ఇప్పుడు పిల్లల కు మంచి చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నాం.
► పిల్లలకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే నిర్ణయాలు తీసుకోవాలి. ఎవరినీ ఇబ్బందులకు గురి చేయొద్దు. అధికారులు అందరూ కూర్చొని టీచర్ల రీ పొజిషన్‌కు సంబంధించి విధి విధా నాలు రూపొందించాలి.
► ప్రభుత్వ పాఠశాలల్లో మంచి చదువులు అందించడానికి విప్లవాత్మకంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. 
చురుగ్గా పనులు
► నాడు –నేడు కార్యక్రమాల్లో నాణ్యతను ఎలా పెంచాలన్న దానిపై దృష్టి పెట్టాలి. దీని కోసం ఒక విధానాన్ని రూపొందించాలి. ఆగస్టు 3న పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నందున, జూలై చివరి నాటికి పనులన్నీ పూర్తి చేయాలి.
► నాడు – నేడు పనులకు సంబంధించి రూ.533 కోట్లు పేరెంట్స్‌ కమిటీల ఖాతాల్లో ఉన్నాయని అ«ధికారులు వెల్లడించారు. గుంటూరు జిల్లాలో అత్యధిక నిధులు ఖర్చయ్యాయని, లాక్‌డౌన్‌ సడలింపులతో గత వారం నుంచి పనుల్లో వేగం పెరిగిందని చెప్పారు.
► ప్రత్యేకంగా జేసీలను నియమించడం వల్ల పనులు చాలా చురుగ్గా సాగుతున్నాయని అధికారులు వివరించారు.  
 
Flash...   NEW TEACHER ATTENDANCE APP LATEST VERSION