ఒక్క విద్యార్థిని కోసం పడవ నడుపుతున్న Government

కరోనా వైరస్‌పై పోరాటంలో కేరళ ఇప్పటికే తన మార్క్‌ను చూపించింది. లాక్‌డౌన్‌ను కూడా
సమర్థవంతంగా అమలు చేస్తూ బాధితుల సంఖ్యను క్రమేనా తగ్గిస్తోంది. తాజాగా ఇంటర్
విద్యార్థుల కోసం పరీక్షలు కూడా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు కరోనా
వైరస్ బారినపడకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటోంది. అయితే, ఓ విద్యార్థిని
పరీక్షల కేంద్రానికి వెళ్లేందుకు తగని సదుపాయాలు లేక ఇబ్బంది పడింది. ఈ విషయం
తెలుసుకున్న ప్రభుత్వ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
కేరళలోని అలప్పూజ జిల్లా ఎమ్ఎన్ బ్లాక్ ప్రాంతానికి చెందిన సాండ్రా అనే ఓ 17 ఏళ్ల
అమ్మాయి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. అయితే, పరీక్ష కేంద్రానికి వెళ్లడానికి
సదుపాయం లేదు. ఆర్థిక ఇబ్బందుల వల్ల రవాణా ఖర్చులకు కూడా ఆమె కుటుంబం వద్ద డబ్బులు
లేవు. కానీ, సాండ్రా ఎలాగైనా సరే పరీక్షలు రాయాలని నిర్ణయించుకుంది. తన సమస్యను
కేరళ రాష్ట్ర నీటి సరఫరా సంస్థ(ఎస్‌డబ్ల్యూటీడీ) అధికారులకు వివరించింది.
సాండ్రా అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన అధికారులు ఆమె కోసం పడవను ఏర్పాటుచేశారు.
శుక్రవారం, శనివారం జరిగిన పరీక్షల కోసం సాండ్రాను ఎమ్ఎన్ బ్లాక్ నుంచి
కొట్టాయంలోని కంజిరామ్ వరకు తీసుకెళ్లారు. సాధారణంగా ఈ పడవను సింగిల్ ట్రిప్
నడిపేందుకు రూ.4 వేలు వసూలు చేస్తారు. అయితే, సాండ్రా కోసమే నడిపినా.. ఆమె నుంచి
ట్రిప్పుకు రూ.9 చొప్పున వసూలు చేశామని అధికారులు తెలిపారు.
Flash...   కంటెయిన్‌మెంట్‌ జోన్లలో తరగతులు ఉండవు