Heavy Rains in AP: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

Heavy Rains in AP: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

విజయవాడ, జూలై 05: నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. బుధవారం కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో గాలులు వీస్తాయని చెబుతున్నారు. పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. వ్యవసాయ పనులు చేసే రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

బుధవారం పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మిగిలిన జిల్లాల్లో చిరు జల్లులు పడే అవకాశం ఉందని తెలిపారు.

తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించిన తర్వాత నెమ్మదించిన నైరుతి రుతుపవనాలకు ఊతం ఇచ్చేందుకు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో బుధవారం నుంచి మూడు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణలోని ఆరు జిల్లాలకు భారీ వర్ష సూచనతో పాటు 19 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.

నిజామాబాద్, జగిత్యాల, ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో ఓ మోస్తరు, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్‌కర్నూల్, యాదాద్రి, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. , IMD తెలిపింది. పేర్కొన్నారు. మరోవైపు ఈ ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కొన్ని చోట్ల ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది

Flash...   CYCLONE ASANI: బంగాళాఖాతంలో ‘అశని’ తుపాను..