List of Holidays / Examinations for 2022-23 by DCEB Eluru


కోవిడ్ – 19 దృష్టా 2021-22 ఎస్.ఎస్.సి పరీక్షలు నిర్వహించనప్పటికీ 2021-22 విద్యా సంవత్సరములో 10వ తరగతి ఇయర్ ప్లాన్, స్టడీ మెటీరియల్, రివిజన్ టెన్ల ప్రశ్నా పత్రాలు తయారు చేయుటకు సహకరించిన ఉపాధ్యాయులకు ప్రత్యేక అభినందనలు. 

అదే స్ఫూర్తితో నూతనోత్తేజాన్ని, ఉత్సాహాన్ని, సంతరించుకొని ఈ విద్యా సంవత్సరములో రాబోవు మార్చిలో జరుగు పబ్లిక్ పరీక్షలలో ఉన్నత విద్యా ప్రమాణాలతోబాటు మరింత మంచి ఫలితాలను సాధించి మన విద్యాశాఖకు మంచి పేరు తెచ్చి జిల్లా కీర్తిని ఇనుమడింప చేస్తారని ఆశిస్తున్నాము. 

అందుకు అనుగుణంగా ప్రధానోపాధ్యాయులు ఈ విద్యా సంవత్సరములో స్వయంగా పాఠశాలల సంస్థాగత ప్రణాళిక కనీస విద్యాకార్యక్రమాన్ని రూపొందించి 2022-23 విద్యా సంవత్సరములో ప్రారంభం నుండే ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలలో అమలు పరచుకోవలెను.

2022-23 విద్యా సంవత్సరములో 31-08-2022 నాటికి 6వ నుండి 10వ తరగతి వరకు గల విద్యార్థినీ విద్యార్థుల సంఖ్య ఆధారంగా “Strength Particulars” ప్రోఫార్మ పూర్తి చేసిన ఒక కాపీని మీ పాఠశాల యొక్క గుర్తింపు ఉత్తర్వులు కూడా జతపరిచి ది. 10-09-2022 నాటికి D.C.E.B. కార్యాలయానికి పంపాలి. ఒక కాపీని తమ కార్యాలయంలో ఉంచుకోవాలి. మరొక కాపీని మీ పర్యవేక్షణ అధికారికి సమర్పించవలెను.

2022-23 విద్యా సంవత్సరంలో తాత్కాలిక సెలవులు పట్టిక,  ఎకడమిక్ కేలండర్ అన్నిపాఠశాలలకు ఈ లెటర్  ద్వారా పంపడం జరిగింది.

మన విద్యాశాఖాధికారుల ఆదేశాల మేరకు విద్యా ప్రణాళికలను, కనీస విద్యాకార్యక్రమాన్ని చిత్తశుద్ధితో అమలుపరచి, ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులను నిర్వహిస్తూ ఉన్నత విద్యా ప్రమాణాలతో అత్యుత్తమ ఫలితాలను సాధించడానికి టి.సి. పుస్తకము కొరకు తప్పనిసరిగా మీ పాఠశాల యొక్క గుర్తింపు ఉత్తర్వులు జతపరచవలెను. 

ప్రభుత్వ/ జిల్లా పరిషత్ / మున్సిపల్/ ఎయిడెడ్ పాఠశాలలకు పుస్తకము ఒక్కింటికి రూ. 260/- మరియు అన్ ఎయిడెడ్ పాఠశాలలకు రూ.360/-లు చొప్పున సెక్రెటరీ, డి.సి.ఇ.బి.. పశ్చిమ గోదావరి జిల్లా. ఎస్.బి.ఐ. ఏలూరు వారి అక్కౌంట్ నెం. 10616169919 నకు జమ చేసి, ఆ కౌంటర్ రశీదు పై ప్రధానోపాధ్యాయులు సంతకం చేసి కవరింగ్ లెటర్ సంబంధిత ఉప విద్యాశాఖాధికారి వారిని సంప్రదించవలెను. 

Flash...   Jagananna Smart Township - Official website - Registrations open

1 నుంచి 8వ తరగతి వరకు ఆర్.టి.ఇ. చట్ట ప్రకారము ప్రభుత్వ, జిల్లా ప్రజాపరిషత్, మున్సిపాలిటీ, ట్రైబల్ మరియు ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థుల నుండి ఎటువంటి ఫీజులు వసూలు చేయరాదు.

అన్ఎయిడెడ్ పాఠశాలలు 1 నుండి 5వ తరగతి విద్యార్థుల వివరాలను కాంప్లెక్స్ వారిగా సి.ఆర్.పి. ద్వారా సేకరించి మరియు పరీక్ష ఫీజును చెల్లించవలెను. ఎమ్.ఇ.ఓ/సి.ఆర్.పి.లు తగు చర్య తీసుకోవలసినదిగా తెలియజేయడమైనది. 

1 నుండి 5వ తరగతి విద్యార్థులకు Strength  పర్టిక్యులర్స్ ప్రొఫార్మాను ఎమ్ ఇఓ కార్యాలయమునకు మెయిల్ చేయబడును. 

 అన్ని అన్ఎయిడెడ్ పాఠశాలలు 1వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు ఈ క్రింది పట్టిక ప్రకారము రుసుము చెల్లించవలెను. మరియు 9,10 తరగతుల Govt/ZP/Mpl/TWAS మరియు అన్ని రెసిడెన్షియల్ పాఠశాలలు ఈ క్రింది విధంగా ఫీజు చెల్లించవలెను. మరియు ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చేంత వరకు ఈ పరీక్షలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాగా జరుగును.

గమనిక:

1. అన్నియాజమాన్యాల పాఠశాలలకు 2022-23వ విద్యా సంవత్సరమునకు గాను ఫార్మేటివ్ 1,2,3,4 మరియు సమ్మెటివ్ 1 & 2. ప్రశ్నాపత్రములు 10వ తరగతి విద్యార్థులకు డి.సి.యి.బి. ద్వారా ముద్రించి పంపబడును. మరియు అన్ని యాజమాన్య పాఠశాలలకు 1 నుండి 9వ తరగతి వరకు ఎస్.ఎ. -1 & ఎస్.ఎ.-2 ప్రశ్నాపత్రములు డి.సి.యి. బి ద్వారా ముద్రించి పంపబడును.

2. అన్ఎయిడెడ్ పాఠశాలలో తరగతుల వారిగా విద్యార్థుల సంఖ్య 10లోపు ఉన్నట్లయితే 10 మందికి ప్రశ్నపత్రముల రుసుము చెల్లించవలసినదే.

2022-23 సంవత్సరములకు సంబంధించిన ఉన్నత పాఠశాలల విద్యావిషయక క్యాలండర్ను మీ సంబంధిత ఉప విద్యాశాఖాధికారులు/ మండల విద్యాశాఖాధికారుల ఈ-మెయిల్ నుండి డౌన్లోడ్ చేసుకోవలసినదిగా ప్రధానోపాధ్యాయులకు సూచించడమైనది మరియు జిల్లా విద్యాశాఖాధికారి వెబ్సైట్ https://www.deoeluru.org/ నుండి కూడా డౌన్లోడ్ చేసుకోనవచ్చును. ఉన్నత పాఠశాలల విద్యావిషయక క్యాలండెర్ సిలబస్ ప్రకారమే నిర్మాణాత్మక, సంగ్రహణాత్మక పరీక్షలు నిర్వహించబడును.

మీకు పంపిన “స్ట్రెంత్ పర్టిక్యులర్స్” ప్రొఫార్మా పూర్తిచేసి, దానితో పాటు ప్రశ్నా పత్రములు కొరకు మీరు చెల్లించవలసిన మొత్తము సొమ్మును ‘సెక్రటరీ, ఏలూరు జిల్లా, కామన్ ఎగ్జామినేషన్ బోర్డ్, ఏలూరు” వారి పేరుతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా / ఎస్.బి.ఐ., ఏలూరు నందు చెల్లించబడే విధంగా క్రాస్ట్ డి.డి. తీసుకొని 10-09-2022 తేదీలోగా ది. సెక్రటరీ, డి.సి.ఇ.బి., జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయము, ఏలూరు – 534 006, ఏలూరు జిల్లా, చిరునామాకు పంపవలసినదిగా కోరుచున్నాము. పూర్తి సొమ్మును చెల్లించవలెను.

జిల్లాలోని అన్నీ యాజమాన్యముల పరిధిలో గల ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలల విద్యార్థుల సంఖ్యా వివరములు (తరగతి వారీగా) మరియు కాంట్రిబ్యూషన్ 10-09-2022 లోగా జిల్లా కామన్ ఎక్జామినేష్ బోర్డ్ వారికి బ్యాంక్ డ్రాఫ్ట్ ద్వారా చెల్లించి తగు రశీదు పొంది 10వ తరగతి నామినల్ రోల్స్ ను సమర్పించు సమయమున ఉప విద్యాశాఖాధికారి వారికి రశీదు చూపించవలయును… 

జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలు ఉమ్మడి పరీక్షల నిర్వహణ సంస్థచే నిర్వహించబడు పరీక్షలు, పనిదినములు షెడ్యూల్ ప్రకారము తప్పనిసరిగా నిర్వహించవలెను. లేనిచో ఆ పాఠశాల గుర్తింపు రద్దు పరచబడును. 

జిల్లాలోని ప్రశ్నాపత్రములు సంబంధిత మండల విద్యాశాఖ కార్యలయంనుండి పరీక్షలకు ఒక రోజు ముందుగా ప్రశ్న పత్రములు తీసుకొనవలయును. ప్రశ్న పత్రములు మీ పాఠశాల విద్యార్థి సంఖ్య ఆధారముగా కొతగ్గిన కార్యదర్శి వారిని సంప్రదించగలరు.

జిల్లా ఉమ్మడి పరీక్షల సంస్థ కార్యాలయము మధ్యాహ్నము 3 గంటల నుండి 6 గంటల వరకు పనిచేయును.