9 గంటల్లోపు హాజరు వేయకపోతే సెలవు పెట్టాల్సిందే..! CL పెట్టినా మీ పేరు చూపిస్తుందా!

9 గంటల్లోపు హాజరు వేయకపోతే సెలవు పెట్టాల్సిందే..! CL పెట్టినా మీ పేరు చూపిస్తుందా!

టీచర్లను వేధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని అస్త్రాలను బయటకు తీస్తోంది.

గతంలో జీతాల చెల్లింపులో జాప్యం.. ఆందోళనలకు పిలుపునిస్తే ముందస్తు అరెస్టులు, బైండోవర్ కేసులు పెట్టారు. గత కొంత కాలంగా తనిఖీలు, షోకాజ్ నోటీసులతో భయభ్రాంతులకు గురిచేసిన ప్రభుత్వం.. ఇప్పుడు ముఖ హాజరు నమోదుపై దృష్టి సారించింది. సిగ్నల్స్‌తో సంబంధం లేకుండా నిర్ణీత గడువులోగా అందరూ ఆన్‌లైన్‌లో హాజరుకావాలని ఆదేశించారు. కాస్త ఆలస్యంగా హాజరైతే సెలవు పెట్టాల్సి వస్తుందని వాట్సాప్ లో సమాచారం పంపింది. జిల్లా స్థాయి అధికారులు ప్రధానోపాధ్యాయులకు సమాచారం పంపారు. సోమవారం నుంచి పటిష్టంగా అమలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

ఉదయం 9 గంటలకు ముందు హాజరైన వారినే సకాలం లో విధులకు హాజరు గా లెక్కిస్తారు. ఆ తర్వాత హాజరైతే CL పెట్టాల్సిందే. CL వేయకపోతే షోకాజ్ నోటీసు జారీ చేసి వివరణ కోరనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1.80 లక్షల మంది టీచర్ లు పనిచేస్తున్నారు. ఉదయం 9 గంటల తర్వాత కొందరు హాజరువేస్తున్నారు అని కమాండ్ కంట్రోల్ రూం నుంచి క్షేత్రస్థాయి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సెలవుల నిబంధనల ప్రకారం నెలలో మూడుసార్లు ఆలస్యంగా వస్తే సగం రోజు CL నమోదు చేయవలసి ఉంటుంది. కానీ, ఇప్పుడు ఆ విషయం చెప్పకుండా ఆలస్యంగా వస్తే సెలవు పెట్టాల్సి వస్తుందని వార్నింగ్ లు ఇస్తున్నారు. ప్రతిభుత్వం గతం లో ఈ ముఖ హాజరు మీద పది నిమిషాలు పటు ఆలస్యం అయినా కూడా పరిగణన లోకి తీసుకుంటాం అని కూడా ఉత్తర్వులు జారీ చేసి ప్రస్తుతం ఆ ఉత్తర్వులని ఖాతరు చేయకుండా కింది స్థాయి అధికారులకి ఈ విధం గా ఆదేశాలు ఇవ్వటం మీద ఉపాధ్యాయ లోకం మంది పదుహాతోంది

సిగ్నల్స్ లేకుంటే..

రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో సెల్ సిగ్నల్స్ అందుబాటులో లేవు. గిరిజన ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. అలాంటి చోట ఆలస్యంగా హాజరు నమోదైతే ఉపాధ్యాయుల పరిస్థితి ఏంటని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు. క్యాడర్ స్ట్రెంత్ పూర్తి కాకపోవడంతో వారి హాజరు నమోదుపై స్పష్టత లేదు. వీరిలో కొంతమంది హాజరు కాలేదని డాష్‌బోర్డ్ చూపిస్తుంది. దీన్ని DDO సరిచేయాలి.

Flash...   ఉద్యోగుల ముఖ హాజరు స్టేటస్ వివరాలు ఒక్క క్లిక్ తో తెలుసుకోండి

హాజరు యాప్ లో CL నమోదుకు ఇబ్బందులు

కొన్ని జిల్లాలలో పై అధికారు (DDO)లు  టీచర్ ల వ్యక్తిగత సెలవు MODULE ని అప్రూవ్ చేయని కారణం గా చాలా మ0ది ఉపాధ్యాయుల సెలవు ఆన్లైన్ లో నమోదు కి యాప్ అనుమతి ఇవ్వటం లేదు . ఈ సమస్యని త్వరగా పరిష్కరించాలి అని కూడా ఉపాధ్యాయులు విన్నవించారు . శనివారం హాజరు వేయని వారి లిస్ట్ లో CL పెట్టిన వారి పేర్లు కూడా రావటం వారిని కలవర పరిచాయి.

సాంకేతిక కారణాలు దృష్ట్యా హాజరు నమోదు కి పది నిమిషాలు గ్రేస్ పీరియడ్ ఇస్తూ ఉత్తరువులు