SBI నుంచి సూపర్ స్కీం.. కొద్దిరోజులే ఛాన్స్!

SBI నుంచి సూపర్ స్కీం.. కొద్దిరోజులే ఛాన్స్!

ప్రస్తుత కాలంలో, ఫిక్స్‌డ్ డిపాజిట్లు మంచి పొదుపు ఎంపికలుగా మారాయి. ఎందుకంటే ఇతర పొదుపు పథకాలతో పోలిస్తే ఇది మెరుగైన వడ్డీ రేట్లు కలిగి ఉంది.

ఈ నేపథ్యంలో.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఓ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. మరి.. ఆ పథకం ఏంటి..? దానికి ఎవరు అర్హులు? గడువు ఎప్పుడు? ఇప్పుడు తెలుసుకుందాం.

సీనియర్ సిటిజన్ కోసం SBI Wecare ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్: “ఫిక్స్‌డ్ డిపాజిట్..” అనేది ప్రసిద్ధ సురక్షిత పెట్టుబడి పథకాలలో ఒకటి. ఈ ఖాతాను బ్యాంకులు మరియు పోస్టాఫీసులలో తెరవవచ్చు. మీరు డిపాజిట్ చేసిన మొత్తంపై మీకు అధిక వడ్డీ లభిస్తుంది. సాధారణ పౌరుల కంటే సీనియర్ సిటిజన్లకు ఎక్కువ శాతం వడ్డీ లభిస్తుంది. కొన్ని బ్యాంకులు సీనియర్ సిటిజన్ల కోసం మాత్రమే ప్రత్యేక FD పథకాలను ప్రారంభించాయి. ఈ కోవకు చెందినదే.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన తాజా పథకం. దాని పేరు SBI VKARE. ఈ పథకం ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్ల కోసం రూపొందించబడింది.

SBI Wecare సీనియర్ సిటిజన్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ పూర్తి వివరాలు: మే 2020లో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. SBI ‘WE CARE’ సీనియర్ సిటిజన్స్ టర్మ్ డిపాజిట్ స్కీమ్‌ను ప్రారంభించింది. దీని గడువు మొదటగా సెప్టెంబర్ 2020 వరకు ఉంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో, ఈ ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం చాలాసార్లు పొడిగించబడింది. ఈ ఏడాది మార్చి 31తో ఈ పథకం గడువు ముగియాల్సి ఉండగా.. జూన్ 30 వరకు పొడిగించగా.. మళ్లీ సెప్టెంబర్ 30 వరకు పొడిగించారు.

ఇదీ ఎస్‌బీఐ లక్ష్యం..: సీనియర్‌ సిటిజన్‌లకు అధిక రాబడిని అందించే లక్ష్యంతో ఎస్‌బీఐ వీకేర్‌ డిపాజిట్‌ పథకాన్ని అందిస్తున్నట్లు బ్యాంక్‌ తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. సీనియర్ సిటిజన్స్‌తో సంబంధాన్ని మరికొన్ని సంవత్సరాల పాటు కొనసాగించేందుకు గడువును పొడిగిస్తున్నట్లు తెలిపింది.

Flash...   పశు సంవర్ధక శాఖలో 1,896 వీఏహెచ్‌ఏ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌.

High benefits

SBI WECARE FD పథకం యొక్క ప్రయోజనాలు:

SPI ఈ ప్రత్యేక పథకం ద్వారా సీనియర్ సిటిజన్లకు అధిక వడ్డీని అందిస్తోంది. ఇతర ఎఫ్‌డి పథకాలపై సీనియర్ సిటిజన్‌లకు రెగ్యులర్‌గా అందించే అదనపు 50 బేసిస్ పాయింట్లు కాకుండా, ఈ స్కీమ్ 50 బేసిస్ పాయింట్లు ఎక్కువ వడ్డీని కూడా అందిస్తుంది. అంటే సాధారణ కస్టమర్ల కంటే 100 బేసిస్ పాయింట్లు ఎక్కువ వడ్డీ. ఈ పథకంలో, సీనియర్ సిటిజన్లకు ప్రస్తుతం 7.5 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. ఇది 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల కాల వ్యవధి డిపాజిట్లకు వర్తిస్తుంది.

Who are eligible for the scheme.

అర్హత: 60 ఏళ్లు పైబడిన భారతీయ పౌరులు మాత్రమే SBI వీకేర్ కింద ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాను తెరవడానికి అర్హులు. ఇది డొమెస్టిక్ టర్మ్ డిపాజిట్ స్కీమ్ అయినందున, ఎన్నారైలు ఖాతా తెరవడానికి అవకాశం లేదు. డబ్బు భద్రత మాత్రమే కావాలంటే రెగ్యులర్ ఎఫ్‌డిలు మంచివి. సీనియర్ సిటిజన్లు మరియు హై రిస్క్ గ్రూపులు కూడా ఈ డిపాజిట్లను చేయవచ్చు. కరోనా కాలంలో 60 ఏళ్లు నిండిన సీనియర్ సిటిజన్ల కోసం చాలా బ్యాంకులు ప్రత్యేక FD పథకాలను ప్రారంభించాయి.

How to start..?

SBI WECARE FD పథకాన్ని ఎలా తెరవాలి: SBI WECARE ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌ని నెట్ బ్యాంకింగ్ ద్వారా లేదా నేరుగా బ్యాంక్ బ్రాంచ్‌ని సందర్శించడం ద్వారా తీసుకోవచ్చు. అలాగే స్టేట్ బ్యాంక్ యోనో యాప్ ద్వారా ఈ పథకంలో చేరవచ్చు.