AP లో దసరా సెలవులు.. మొత్తం ఎన్ని రోజులు అంటే..?

AP లో దసరా సెలవులు.. మొత్తం ఎన్ని రోజులు అంటే..?

AP DASARA HOLIDAYS INFORMATION , DASARA HOLIDAYS TO SCHOOLS

ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలలు, కళాశాలలకు త్వరలో దసరా సెలవులు రానున్నాయి. తెలంగాణలో కంటే ఏపీలో ఈసారి దసరా సెలవులు తక్కువగా ఉన్నాయి. ఈసారి తెలంగాణలో మొత్తం 13 రోజుల దసరా సెలవులు ఇచ్చారు.

కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం 10 రోజులు దసరా సెలవులు ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. అందుకే స్కూళ్లు, కాలేజీలకు ముందుగానే సెలవులు ప్రకటించారు. అలాగే, చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే తమ క్యాలెండర్‌లో పాఠశాలలు, కళాశాలలు మరియు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులను చేర్చాయి.

ఈసారి తగ్గిన సెలవులు ఇలా..

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు అక్టోబర్ 14 నుంచి 24 వరకు దసరా సెలవులు.. మొత్తం 10 రోజుల పాటు పాఠశాలలకు దసరా సెలవులు రానున్నాయి. అక్టోబర్ 25 (బుధవారం) పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలలకు 2023-24 విద్యా క్యాలెండర్‌లో పాఠశాల విద్యా శాఖ ఈ సెలవుల పూర్తి వివరాలను పొందుపరిచింది. క్రిస్మస్ సెలవులను కూడా ఏడు నుంచి ఐదుకు తగ్గించారు. జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఇస్తారని.. ప్రతి నెల మూడో శనివారం పేరెంట్‌-టీచర్‌ సమావేశం నిర్వహించాలన్నారు. ప్రతినెలా మొదటి వారంలో పాఠశాల విద్యా కమిటీ సమావేశాలు నిర్వహించాలి.

2023-24 ఆంధ్రప్రదేశ్‌లో సెలవుల పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి:

☛ అక్టోబర్ 14 నుండి 24 వరకు దసరా సెలవులు

☛ జనవరి 9, 2024 నుండి 18, 2024 వరకు సంక్రాంతి సెలవులు

☛ డిసెంబర్ 17 నుండి 26 వరకు క్రిస్మస్ సెలవులు (మిషనరీ పాఠశాలలకు మాత్రమే..)

☛ అలాగే దీపావళి, ఉగాది మరియు రంజాన్ వంటి సెలవులు కూడా ఆ రోజు ప్రకారం ఇవ్వబడతాయి.

Flash...   ఏడు / పదవ తరగతి తో 14,000 అంగన్వాడీ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌..