Gas Cylinder Price: వంట గ్యాస్‌ సిలిండర్‌ బాదుడు.. ఎంత పెరిగిందంటే?

 Gas Cylinder Price: వంట గ్యాస్‌ సిలిండర్‌ బాదుడు.. ఎంత పెరిగిందంటే?


హైదరాబాద్‌: చమురు సంస్థలు ఉదయాన్నే సామాన్యులకు షాక్‌ ఇచ్చాయి. గృహ వినియోగ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.50 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరతో సిలిండర్‌ ధర రూ.1052కు చేరింది. పెంచిన ధర వెంటనే అమల్లోకి వస్తుందని చమురు సంస్థలు వెల్లడించాయి. 

కాగా, 19 కిలోల వాణిజ్య సిలిండర్‌ ధర ఇటీవల పెరిగిన విషయం తెలిసిందే. ఈ నెల 1న పెరిగిన ధరతో హైదరాబాద్‌లో వాణిజ్య సిలిండర్‌ ధర రూ.2,460 నుంచి 2,563.50కి చేరింది. 

Flash...   ADHAAR ENROLLMENT CAMPS AT SCHOOLS