AP: పరీక్ష పత్రాల లీకేజ్.. యాక్షన్‌లోకి దిగిన సర్కార్

మాస్ కాపీయింగ్ ను ప్రోత్సహించినట్లు తేలితే సర్వీసు నుండి డిస్మిస్..


ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్ష పత్రాల లీకేజ్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది . మొదటి పరీక్ష మొదలైనప్పటి నుంచి ప్రశ్నాపత్రాలు ఏదో ఒక చోట లీక్ అవుతూనే ఉన్నాయి . నంద్యాల , చిత్తూరు , శ్రీ సత్యసాయి జిల్లాల్లో జరిగిన పేపర్ లీకేజ్ ఘటనల్ని ఇంకా మరువకముందే .. మరోసారి కృష్ణా , కర్నూలు జిల్లాల్లో పేపర్ లీక్ వ్యవహారం సంచలనంగా మారింది . సోమవారం మ్యాథ్స్ పేపర్ సెల్ఫోన్లో ప్రత్యక్షం అవ్వడంతో .. అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు . 

ఈ పేపర్ లీక్ అయిన విషయం తెలిసి , జిల్లా ఎస్పీ సీరియస్ అయ్యారు . యువకుల్ని అదుపులోకి తీసుకొని విచారించగా .. తామే స్వయంగా పరీక్ష పత్రాలు ఫోటోలు తీసుకొచ్చినట్టు వాళ్ళు అంగీకరించారు . కాపీ చిట్టీలు మార్చుకుంటున్న సమయంలో , ఆ యువకులు అడ్డంగా దొరికారు . సెల్ఫోన్ తీసి పరిశీలిస్తే , ప్రశ్నాపత్రం లీకైన మేటర్ వెలుగులోకి వచ్చింది . దీని వెనుక ఎవరి హస్తముందో విచారించాలని ఎస్పీ ఆదేశించారు . మరోవైపు .. వరుసగా ఈ లీకేజ్ ఘటనలు వెలుగుచూస్తుండడంతో , ప్రభుత్వం సీరియస్ అయ్యింది . ఇప్పటివరకు ఈ పత్రాల్ని లీక్ చేసిన 42 మంది టీచర్లు అరెస్ట్ అవ్వగా .. ప్రభుత్వం వారిని సస్పెండ్ చేసింది . ఉద్దేశ్యపూర్వకంగా మాల్ ప్రాక్టీస్ వ్యవహారాలు జరుగుతున్నాయని విద్యా శాఖ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు . ఒకవేళ ఇది నిజమేనని రుజువైతే , ఆయా టీచర్స్ని విధుల నుంచి తొలగించాలని విద్యా శాఖ యోచిస్తోంది . ఈ మాల్ ప్రాక్టీస్ ఎపిసోడుపై మరింత కఠిన చర్యలు తీసుకోవడానికి విద్యా శాఖ సిద్ధమవుతోంది .

 Andhra Pradesh: ఏపీలో ఆగని “పది” పరీక్షపత్రాల లీకులు..  సెల్ ఫోన్ లో ఆన్సర్స్


ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల్లో అవకతవకలు కొనసాగుతున్నాయి. పరీక్షలు ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రశ్నపత్రాలు వాట్సాప్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ ఘటనలు విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా కృష్ణా జిల్లాలోలో మాస్ కాపీయింగ్ చోటుచేసుకుంది. ఇక్కడ ఉపాధ్యాయులే మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహించారు. జిల్లాలోని గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాస్ కాపీయింగ్ కలకలం రేపింది. పక్కనే ఉన్న పామర్రు మండలం పసమర్రు జెడ్పీ పాఠశాల నుంచి ప్రశ్నలకు జవాబుల స్లిప్‌లు పంపుతున్నట్టుగా ఫిర్యాదులు అందాయి.

Flash...   బిగ్ రిలీఫ్.. కరోనా కొత్త వేరియంట్‌ OMICRON పై కొవిడ్ టీకాలు పని చేస్తున్నాయ్..!

దీంతో విద్యాశాఖ అధికారులు, పోలీసులు పసమర్రు జెడ్పీ స్కూల్‌కు చేరుకున్నారు. ఇవాళ జరుగుతున్న పరీక్షలోని ప్రశ్నలకు సమాధానాలను కొందరు ఉపాధ్యాయుల సెల్‌ఫోన్లలో గుర్తించారు. దీనిపై డీఈవో పసమర్రు చేరుకుని విచారిస్తున్నారు. ఇక, మండవల్లిలోని ఓ ప్రైవేట్ స్కూల్ నుంచి వాట్సాప్ ద్వారా ప్రశ్నపత్రం వచ్చినట్టుగా తెలుస్తోంది.

పసుమర్రు హైస్కూల్ నుంచి ప్రశ్నలకు సమాధానాలు వెళ్తున్నాయని టోల్ ఫ్రీ నెంబర్‌కు సమాచారం వచ్చిందని డీఈవో తాహిరా సుల్తానా చెప్పారు. నలుగురు టీచర్లు, స్కూల్ అసిస్టెంట్లు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడినట్టుగా గుర్తించామని తెలిపారు. పసమర్రు స్కూల్‌కు ఎగ్జామ్ సెంటర్ లేదని.. ఇక్కడి విద్యార్థులు డోకిపర్రులో పరీక్షలు రాస్తున్నారని చెప్పారు. విచారణ తర్వాత అన్ని వివరాలను వెల్లడిస్తామని చెప్పారు.