రూ.2,000 నోట్లపై `వాస్తవ` విషయాలను వెల్లడించిన RBI

రూ.2,000 నోట్లపై `వాస్తవ` విషయాలను వెల్లడించిన RBI

దేశంలో రూ.2000 నోట్ల చెలామణి నిలిచిపోయింది. ఇప్పటి వరకు మనుగడలో ఉన్న ఈ పెద్ద నోటు మాయమైంది. ఈ నోట్లు ఇకపై మార్కెట్లో చెల్లవు.

వీటిపై ఎలాంటి లావాదేవీలు నిర్వహించరాదు. అందుబాటులో ఉన్న నోట్లను మార్చుకోవడానికి అక్టోబర్ 7 చివరి తేదీ.

గతంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ 30 చివరి తేదీగా నిర్ణయించగా.. మరో వారం పాటు పొడిగించింది. 2,000 రూపాయల నోట్లను అక్టోబర్ 7 వరకు మార్చుకోవడానికి అనుమతి ఉంది. దీని తర్వాత 2,000 రూపాయల నోటు చిత్తు కాగితంతో సమానంగా ఉంటుంది.

దేశంలో చెలామణిలో ఉన్న 2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకున్నట్లు ఈ ఏడాది మేలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఎలాంటి లావాదేవీలను అంగీకరించబోమని స్పష్టం చేసింది. అక్టోబర్ 8 నుంచి రూ.2000 నోట్ల చెలామణికి పూర్తిగా బ్రేక్ పడనుంది.

ఈ పరిస్థితుల్లో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తాజాగా కీలక విషయాలు వెల్లడించారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి రూ.3.62 లక్షల కోట్ల మేరకు 2 వేల రూపాయల నోట్లు చలామణిలో ఉన్నాయని, అయితే మే 19 నాటికి ఈ సంఖ్య రూ.3.56 లక్షల కోట్లకు తగ్గిందని చెప్పారు.

జూలై 31 నాటికి ఈ సంఖ్య మరింత తగ్గింది. మార్కెట్‌లో చెలామణిలో ఉన్న రూ.2000 నోట్లు నెల ప్రారంభంలో రూ.3.14 లక్షల కోట్లు ఉండగా, అదే నెల 31 నాటికి రూ.0.42 లక్షల కోట్లకు పడిపోయాయి. మే 19 నుంచి జూలై 31 వరకు తమ వద్ద 88 శాతం నోట్లు డిపాజిట్ అయ్యాయని వివరించారు.

మార్కెట్‌లో రూ.12 వేల కోట్ల విలువైన 2000 నోట్లు చలామణిలో ఉన్నాయని శక్తికాంత దాస్ తెలిపారు. 3.37 శాతం నోట్లు ఇంకా బ్యాంకుల్లో జమ కావాల్సి ఉంది. 2000 నోట్లలో ఇప్పటి వరకు 96 శాతం తిరిగి వచ్చినట్లు వివరించారు.

నోట్ల మార్పిడికి గడువును పొడిగించే అవకాశం లేదని శక్తికాంత దాస్ తేల్చిచెప్పారు. అక్టోబరు 8 నుంచి ఈ నోట్ల చలామణి ఆగిపోతుందని, బ్యాంకుల్లో డిపాజిట్ చేయలేమని చెప్పారు. ఎల్లుండికి రూ. 2,000 నోట్లను స్వీకరించడాన్ని బ్యాంకులు నిలిపివేస్తాయి.

Flash...   Income Tax assessment softwares 2020-21