టీచర్ల బదిలీలకు బ్రేక్.. ఈనెల 19 వరకు ప్రక్రియ నిలిపివేయాలని హైకోర్టు స్టే

టీచర్ల బదిలీలకు బ్రేక్.. ఈనెల 19 వరకు ప్రక్రియ నిలిపివేయాలని హైకోర్టు స్టే

తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు ఇప్పట్లో ముగిసేలా లేవు. ఈ ప్రక్రియ ఇంకా కోర్టు చుట్టూ నడుస్తోంది. తాజాగా మరోసారి ఉపాధ్యాయుల బదిలీలకు బ్రేక్ పడింది.

ఉపాధ్యాయుల బదిలీలను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతులు లేని బదిలీల కౌన్సెలింగ్‌పై ఈ నెల 19లోగా కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది.

రంగారెడ్డి జిల్లాకు పరిమితికి మించి బదిలీలు, పదోన్నతులు పూర్తికాకుండానే బదిలీల కౌన్సెలింగ్‌ను సవాల్ చేస్తూ పలువురు ఉపాధ్యాయులు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. ఇతర జిల్లాల నుంచి రంగారెడ్డి జిల్లాకు పాఠశాల అసిస్టెంట్లు, ఎస్జీటీలు పరిమితికి మించి వచ్చి నియామకం జరిగిన నాటి నుంచి సీనియారిటీ తీసుకుని బదిలీల కౌన్సెలింగ్ జాబితాలో తమకంటే ముందున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది దొంతినేని బాలకిషన్‌రావు కోర్టుకు తెలిపారు. స్థానిక జిల్లా ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతోందని కోర్టు. హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాల మేరకు బదిలీలు చేపడుతున్నామని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పదోన్నతుల తర్వాతే బదిలీలు చేస్తారని.. అందుకు విరుద్ధంగా బదిలీలు ఎలా చేపడతారని ప్రశ్నిస్తూ.. విచారణను ఈ నెల 19కి వాయిదా వేశారు.

Flash...   అధికారుల లెక్కలన్నీ బుస్సే… కరోనా మరణాలు ఎక్కువే.. ఇదిగో సాక్ష్యం..!!