SBI: స్టేట్ బ్యాంక్ కీలక నిర్ణయం.. సేవింగ్స్, శాలరీ అకౌంట్ల రీడిజైన్

 SBI: స్టేట్ బ్యాంక్ కీలక నిర్ణయం.. సేవింగ్స్, శాలరీ అకౌంట్ల రీడిజైన్.. పూర్తి వివరాలివే

భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank Of India- SBI) వినియోగదారుల కోసం సరికొత్తగా ముందుకు రాబోతుంది. క్రెడిట్ మార్కెట్‌ వృద్ధి చెందుతున్న తరుణంలో, పోటీని తట్టుకుని తన ప్రొడక్ట్స్‌ను వినియోగదారులకు చేరువ చేయడంతో పాటు డిపాజిట్లను ఆకర్షించే ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు ఎస్‌బీఐ సరికొత్త మార్గాన్ని అన్వేషిస్తోంది. డిపాజిట్లను ఆకర్షించే ప్రయత్నాల్లో భాగంగా, బ్యాంక్ అందించే కరెంట్ అండ్ సేవింగ్స్ ఖాతాలు (CASA), శాలరీ అకౌంట్స్, ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్ బిజినెస్‌ను పునర్నిర్మించాలని భావిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకులు డిపాజిట్ల కోసం కొత్త ప్లాన్లను వెతుకుతున్నాయి. ఈ క్రమంలో స్టేట్ బ్యాంక్ కూడా బిజినెస్‌లో మార్పులు చేపట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

READ: 

సులభంగానే రూ.14 లక్షల రుణం.. అర్హతలు ఇవే!

PPF కేవలం 1% వడ్డీకి రుణం ఇస్తుంది! ఇదీ ప్రక్రియ!!

అద్భుత పథకం.. రూ. 10,000 పెట్టుబడి మరియు రూ. 16 లక్షల ఆదాయం..!

WhatsApp ద్వారా SBI బ్యాంక్ సేవలు.

SBI లో ప్రస్తుతం కరెంట్, సేవింగ్స్ అకౌంట్స్ డిపాజిట్స్ ప్రవాహం తగ్గింది. కానీ, క్రెడిట్ డిమాండ్ మాత్రం క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే పలు బ్యాంకులు డిపాజిట్స్ పెంచుకునేందుకు వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్స్ ప్రకటించాయి. త్వరలో పండుగల సీజన్ ప్రారంభం కానుంది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని స్టేట్ బ్యాంక్ కూడా డిపాజిట్స్ పెంచుకోవాలని నిర్ణయించింది. ఈ క్రమంలో వ్యాపారాన్ని ఇంకా విస్తరించడంతో పాటు వినియోగదారులకు సేవలు అందించేందుకు ఎక్స్‌టర్నల్ కన్సల్టెంట్‌ను నియమించుకోవాలని నిర్ణయించింది. ఆ కన్సల్టెంట్ ఎస్‌బీఐ (SBI) ఇంటర్నల్ యూనిట్స్, సర్కిల్ టీమ్స్‌తో చర్చించి సరికొత్త ఐడియాలను ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది.

ఎస్‌బీఐ (SBI) ఇందుకు ఏడాది కాలం పాటు కన్సల్టెంట్‌ను నియమించుకోనుంది. అవసరాన్ని బట్టి కన్సల్టెంట్‌ సేవలను ఇంకో ఏడాది కాలం పాటు పొడిగించొచ్చు. కరెంట్ అండ్ సేవింగ్స్ అకౌంట్స్ (CASA) ప్రాధాన్యతగా గుర్తించి ఇప్పటికే ఉన్న ప్రీమియం, హై వాల్యూ కస్టమర్స్‌ చేత మరిన్ని డిపాజిట్లు చేయించాలని ఆలోచిస్తున్నట్లు ఎస్‌బీఐ మేనేజింగ్ డైరెక్టర్ అలోక్ కుమార్ చౌదరి తెలిపారు. కొత్త వినియోగదారులతో కొత్త అకౌంట్స్ ఓపెన్ చేయించడంతో పాటు ఇప్పటికే ఉన్న వినియోగదారులతో చక్కటి సంబంధాలు కొనసాగించాలనేది తమ స్ట్రాటజీ అని పేర్కొన్నారు 

Flash...   SSC/OSSC EXAMINATION JUNE 2021 FEE AND DUE DATES

కన్సల్టెంట్ విధులు

ఎస్‌బీఐ నియమించుకునే కన్సల్టెంట్ ఇప్పటికే బ్యాంకుకు ఉన్న వినియోగదారుల అనలిటిక్స్‌ను స్టడీ చేయాల్సి ఉంటుంది. వినియోగదారులే కేంద్రంగా వారికి మరిన్ని సేవలు అందించడంతో పాటు బ్యాంకు ప్రొడక్ట్స్‌ను అందరికీ చేరువయ్యే విధంగా కన్సల్టెంట్ వినూత్న ఆలోచనలు చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రస్తుతం బ్యాంక్ కస్టమర్స్‌కు అందిస్తున్న సేవల గురించి కన్సల్టెంట్ క్లియర్‌గా స్టడీ చేయాలి. ప్రజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్‌లో ఏదైనా లోపాలు ఉంటే వాటిని సరిచేసి సరికొత్తగా ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. డిజిటల్‌గా కస్టమర్స్‌కు సేవలందించే విధంగా అవసరమైన టెక్నాలజీని కన్సల్టెంట్ అందించాలి. దీంతో పాటు సేవింగ్స్, శాలరీ అకౌంట్ల విషయంలో అవసరమైన మార్పులను కన్సల్టెంట్ ఎస్బీఐకి సూచించనుంది